Telangana: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసి తండ్రి రుణం తీర్చుకున్న కన్న కొడుకు

| Edited By: Balaraju Goud

Mar 19, 2024 | 6:56 PM

తెల్లవారితే పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. తండ్రి అంత్యక్రియలు ఒక వైపు. కొడుకు భవిష్యత్తు పరీక్ష మరో వైపు. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుని తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని ఉదయాన్నే పదో తరగతి పరీక్షలకు వెళ్ళాడు. పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చాక, కళ్ళలో దాగిన భాధను కన్నీటి రూపంలో కారుస్తూ తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొన్నాడు ఒక పదో తరగతి విద్యార్థి.

Telangana: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసి తండ్రి రుణం తీర్చుకున్న కన్న కొడుకు
Khammam
Follow us on

ఎవ్వరికైనా.. కన్న తండ్రి అంటే కొండంత ధైర్యం. అందులోనూ పరీక్షలు వచ్చాయంటే, భుజం తట్టి ఎంకాదు, ధైర్యంగా పరీక్షలు రాయమని ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చే కన్న తండ్రి అనుకోకుండా అనారోగ్యంతో మృతి చెందాడు. తెల్లవారితే పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. తండ్రి అంత్యక్రియలు ఒక వైపు. కొడుకు భవిష్యత్తు పరీక్ష మరో వైపు. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుని తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని ఉదయాన్నే పదో తరగతి పరీక్షలకు వెళ్ళాడు. పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చాక, కళ్ళలో దాగిన భాధను కన్నీటి రూపంలో కారుస్తూ తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొన్నాడు ఒక పదో తరగతి విద్యార్థి.

ఖమ్మం జిల్లా కల్లూరులోని శ్రీరాంపురంలో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తెల్లవారితే పదో తరగతి పరీక్షలు. మారబోయిన అఖిల్ తండ్రి గోపి కిడ్నీ వ్యాధి కారణంగా కన్ను మూశాడు. తన తండ్రి చనిపోవడంతో గుండె సన్నగిల్లిపోకుండా దుఃఖాన్ని దిగి మింగుకుని పదో తరగతి పరీక్షకు సిద్దమయ్యాడు. తెల్లవారే పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ కు హాజరై, పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఒక వైపు తండ్రి మీద ప్రేమ..మరో వైపు అఖిల్ భవిష్యత్తుకు పరీక్ష. ఇలా రెండు వైపుల నలిగిపోయి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ కు హాజరైయ్యాడు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అఖిల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన స్థానికులు అఖిల్ కు గుండె ధైర్యం చెప్పి వెళ్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…