Save Life: రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. మెరుపువేగంతో పరుగెత్తి కాపాడిన లేడీ కానిస్టేబుల్

|

Nov 22, 2021 | 9:45 PM

కదులుతున్న రైల్లో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించిన మహిళ పడిపోగా.. లేడి కానిస్టేబుల్ చిరుతలా దూసుకువచ్చి ఆమెను ప్రాణాలతో కాపాడింది.

Save Life: రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. మెరుపువేగంతో పరుగెత్తి కాపాడిన లేడీ కానిస్టేబుల్
Save Life In Railway Station
Follow us on

Female Constable Swiftly React: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ఓ రైల్వే మహిళా కానిస్టేబుల్ పెద్ద సాహసం చేశారు. కదులుతున్న రైల్లో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించిన మహిళ పడిపోగా.. లేడి కానిస్టేబుల్ చిరుతలా దూసుకువచ్చి ఆమెను ప్రాణాలతో కాపాడింది. ఈ దృశ్యాలు రైల్వే స్టేషన్‌లో ఉన్న సీసి కెమెరాలో రికార్డైంది. బైకులా రైల్వేస్టేష‌న్‌లో లోకల్‌ రైలు ఎక్కే ప్రయ‌త్నంలో ఓ నలబై ఏళ్ల మ‌హిళ అదుపుతప్పి డోర్‌లో ప‌డిపోయింది. దీంతో రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మ‌ధ్య ఉన్న గ్యాబులోకి ఆమె జారిపోతున్న సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్‌ మ‌హిళా కానిస్టేబుల్ గోల్కర్‌ గ‌మ‌నించి వెంటనే స్పందించింది.

అప్పటికే రైలు కదులుతుండటంతో.. చిరుతలా ప‌రుగెత్తి బాధితురాలిని ప్లాట్‌ఫామ్‌పైకి లాగేసింది. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా, గ‌త రెండు నెల‌ల వ్యవ‌ధిలో స‌ద‌రు మ‌హిళా కానిస్టేబుల్ ఇలాంటి సాహ‌సం చేయటం ఇది రెండోసారని అధికారులు పేర్కొన్నారు. రెండు నెల‌ల క్రితం కూడా ఓ మ‌హిళా ఇలాగే రైలు ఎక్కబోయి ప‌డిపోతుండ‌గా ఆమె చాక‌చ‌క్యంగా స్పందించి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే.


కాగా, ఆర్పీఎఫ్‌ మ‌హిళా కానిస్టేబుల్ చూపిన ధైర్యానికి ఉన్నతాధికారులు అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. మహిళా కానిస్టేబుల్‌ గోల్కర్ సదరు మ‌హిళ‌ను కాపాడిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది. కానిస్టేబుల్‌ తెగువపై నెటిజ‌న్లు ప్రశంస‌లతో ముంచెత్తుతున్నారు.

Read Also…  Space X: ఎలాన్ మస్క్ కంపెనీలో ఉద్యోగం కావాలా? భారత్ లో స్పెసెక్స్ లో జాబ్ కోసం ఇది చూడాల్సిందే!