Rain: ఈ పక్షి గుడ్డు పెడితే, వర్షం పడాల్సిందే.. అక్కడ వింత నమ్మకం..

|

Jul 18, 2024 | 4:25 PM

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన గ్రామస్థుల్లో ఒక విశ్వాసం ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ కనిపించే తితుడిగా పిలుచుకునే ఓ పక్షి ఉంటుంది. దీన్ని రెడ్-వాటిల్డ్ లాప్‌వింగగా పిలుస్తుంటారు. ఈ పక్షి ఎత్తైన ప్రదేశాల్లో గుడ్లు పెడుతుంటుంది. అయితే ఈ పక్షులు ఇలా గుడ్లు పెడితే కొన్ని రోజుల్లోనే వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు విశ్వసిస్తుంటారు...

Rain: ఈ పక్షి గుడ్డు పెడితే, వర్షం పడాల్సిందే.. అక్కడ వింత నమ్మకం..
Titahari Birds Eggs
Follow us on

సాధారణంగా వర్షం కురుస్తుందో లేదో అన్న విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెబుతారు. ఒక శాస్త్రీయ కోణంలో, పలు పరికరాల ఆధారంగా వాతావరణ రంగ నిపుణులు ఈ విషయాన్ని అంచనా వేసి ప్రజలను అలర్ట్‌ చేస్తుంటారు. అయితే ఒక పక్షి గుడ్లు పెడితే వర్షం పడుతుందనే నమ్మకం ఉందని మీకు తెలుసా.? అవును.. శాస్త్రసాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో కూడా ఇలాంటి నమ్మకాలు ఉండడం వింతే అయినా ఇప్పటికే కొందరు ప్రజలు దీనిని విశ్వసిస్తునారు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన గ్రామస్థుల్లో ఒక విశ్వాసం ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ కనిపించే తితుడిగా పిలుచుకునే ఓ పక్షి ఉంటుంది. దీన్ని రెడ్-వాటిల్డ్ లాప్‌వింగగా పిలుస్తుంటారు. ఈ పక్షి ఎత్తైన ప్రదేశాల్లో గుడ్లు పెడుతుంటుంది. అయితే ఈ పక్షులు ఇలా గుడ్లు పెడితే కొన్ని రోజుల్లోనే వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు విశ్వసిస్తుంటారు. ఏళ్ల నుంచి ఈ వింత విశ్వాసం అమల్లో ఉంది. దీనికి అనుగుణంగానే వర్షాలు కూడా కురుస్తాయి కూడా.

అయితే ఆ పక్షి గుడ్లు పెట్టే స్థానం బట్టి వర్ష సూచన మారుతుంంటుందని అంటున్నారు. ఒకవేళ పక్షి ఎండిపోయిన ప్రవాహాల్లో గుడ్లు పెడితే.. ఆ ఏడాది వర్షాలు ఆలస్యంగా వస్తాయని, లేదా కరువు వచ్చే అవకాశాలు ఉంటాయని మాల్వాలో నివసించే ఆదివాసీ తెగలు భావిస్తారు. అదే విధంగా ఒకవేళ నది ఒడ్డున గుడ్లు పెడితే సాధారణ వర్షాలకు సూచనగా నమ్ముతుంటారు. ఈ నమ్మకాలు ఇక్కడితోనే ఆగిపోలేదు. ఒకవేళ ఈ పక్షులు ఆరు కంటే ఎక్కువ గుడ్లు పెడితే.. పంటలు సమృద్ధిగా పండుతాయని, వర్షాలకు శుభసూచిక అని విశ్వసిస్తారు.

ఈ పక్షులకు వాతావరణ సంకేతాలు ముందుగానే తెలుస్తాయని, అలాగే ఈ పక్షులు ప్రమాదం వచ్చినప్పుడు తమ తోటి పక్షులను అలర్ట్‌ చేసేందుకు బిగ్గరగా అరుస్తాయని స్థానికులు చెబుతుంటారు. ఇక తితహరి పక్షుల విషయానికొస్తే.. ఇవి గడ్డి భూములు, చిన్న రాళ్లు, పాడుబడ్డ భవంతులు, పైకప్పులపై సాధారణంగా వాటి గూడును ఏర్పాటు చేసుకుంటాయి. ప్రతీ ఏటా ఇవి ఏప్రిల్ నుంచి జూన్ మొదటి వారం వరకు దాదాపు 4 నుంచి 6 గుడ్లు పెడతాయి. అందుకే ఇవి గుడ్ల పెట్టకపోతే ఆ సమయంలో వర్షాలు పడవనే ఓ విశ్వాసం ఉంది.

ఇదిలా ఉంటే ఈ పక్షలు గుడ్లు పెట్టి 18 నుంచి 20 రోజుల్లోనే పిల్లలు పొదుగుతాయి. గుడ్డులో నుంచి బయటకు వచ్చిన సమయంలో ఎరుపు రంగులో ఉండే ఈ పక్షులు ఆ తరవ్ఆత నెమ్మదిగా పసుపు రంగులోకి మారుతాయి. కీటకాలను తింటూ జీవనం సాగించే ఈ పక్షులు తమపై ఏవైనా దాడి చేయడానికి వస్తే అజ్ఞాతంలోకి వెళ్లిపోతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..