జాతకంలో జైలు జీవితం రాసిపెట్టి ఉందా.? అక్కడ రూ. 500 ఇస్తే చాలు..

|

Sep 29, 2022 | 11:44 AM

మీ జాతకంలో జైలుకు పోయే అవకాశం ఉందా.? జోతిష్యులు ఇదే మాట చెప్పారా.? అయితే ఇదిగో ఈ వార్త చూడండి..

జాతకంలో జైలు జీవితం రాసిపెట్టి ఉందా.? అక్కడ రూ. 500 ఇస్తే చాలు..
Dummy Jail Uttarakhand
Follow us on

మీ జాతకంలో జైలుకు పోయే అవకాశం ఉందా.? జోతిష్యులు ఇదే మాట చెప్పారా.? అయితే అక్కడ రూ. 500 ఇస్తే చాలు జైలులో గడిపేయొచ్చు. ఇదేందిది.. డబ్బులిచ్చి జైలుకు వెళ్లొచ్చా.. అని ఆశ్చర్యపోతున్నారా..! అవునండీ ఇది నిజమే. ఉత్తరాఖండ్‌లో జైలు అధికారులు ఓ వినూత్న ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

మీరు నిజమైన జైలు జీవితాన్ని గడపాలనుకుంటే.. ఒక్కసారి ఉత్తరాఖండ్ వెళ్లండి. అక్కడి జైలు అధికారులు హల్ద్వానీలో ఓ డమ్మీ జైలును ఏర్పాటు చేశారు. రూ. 500 కడితే గెస్టులు ఒక్క రోజు జైలు జీవితాన్ని గడపవచ్చునని పేర్కొన్నారు. ఖైదీలకు ఇచ్చే బట్టలు, భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక ఈ జైలు కోసం హల్ద్వానీలో 1903వ సంవత్సరంలో నిర్మించబడిన ఓ పాడుపడిన అయుధాగారాన్ని రీమోడలింగ్ చేశారు. జాతకంలో జైలు జీవితం రాసిపెట్టి ఉంటే.. ఈ జైలులో ఒక్క రోజు ఉండాలని.. అలా మీ జైలు జీవితాన్ని పూర్తి చేసుకోవాలని జోతిష్యులు సైతం సలహా ఇస్తున్నారట.

కాగా, హల్ద్వానీ జైలు క్వార్టర్స్, పరిసరాలను ప్రస్తుతం పర్యాటకుల కోసం జైలు అధికారులు రీ-మోడలింగ్ చేస్తున్నారు. దానంతటిని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..