
సాధారణంగా పుట్టుమచ్చలు కేవలం శరీర లక్షణాలని మనం అనుకుంటాం. కానీ, జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాల ప్రకారం, పుట్టుమచ్చలు ఒక వ్యక్తి జీవిత గమనాన్ని, స్వభావాన్ని, ఆర్థిక స్థితిని సూచిస్తాయి. ఏయే స్థానాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం.
ఇది స్త్రీ, పురుషులకు చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. వీరు సంభాషణల్లో ఇతరులను ఆకట్టుకుంటారు. వీరికి అపారమైన కీర్తి, సంపద లభిస్తాయి. వీరు కోపంలో అన్న మాటలు కూడా కొన్నిసార్లు నిజమవుతుంటాయని నమ్ముతారు.
పురుషులకు కుడి అరచేతి మధ్యలో ఉంటే అపారమైన ధనం, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ఎడమ అరచేతిలో ఉంటే అది ఐశ్వర్యానికి సంకేతం.
కళ్లలో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ మచ్చ ఉంటే మంచి ఆస్తిపరుడైన భర్త లభిస్తాడని శాస్త్రం చెబుతోంది.
ఇది స్త్రీలకు అత్యంత శుభప్రదం. వీరికి జీవితంలో ఉన్నత స్థాయి గౌరవం, యోగం దక్కుతాయి. అయితే ఎడమ చెంపపై పుట్టుమచ్చ అంత అనుకూలం కాదు.
వీరిలో అదృష్టం ఉన్నప్పటికీ కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వారి ఆగ్రహాన్ని తగ్గించడం కష్టమవుతుంది.
ఇది కొందరికి అదృష్టాన్ని ఇస్తే, మరికొందరికి కోర్టు గొడవలు లేదా న్యాయపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ పుట్టుమచ్చలు సరైన స్థానంలో లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అనిపిస్తే, ఈ క్రింది పద్ధతులు పాటించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం.
సూర్యాష్టకం పఠించడం.
రెగ్యులర్‌గా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం. గుర్తుంచుకోండి, పుట్టుమచ్చలు సూచనలు మాత్రమే. మన నిరంతర కృషి, పట్టుదల, భగవంతునిపై భక్తి మన తలరాతను సానుకూలంగా మార్చగలవు.