బుల్లెట్‌కి బలయ్యే అవకాశం ఇవ్వండి.. పెళ్లికి అనుమతిపై మిస్సైన కమాండర్ నిషాంత్‌ హాస్యపూరిత లేఖ.. వైరల్‌

| Edited By:

Nov 29, 2020 | 8:20 AM

భారత్‌కి చెందిన మిగ్‌-29కె ఎయిర్‌క్రాఫ్ట్‌ గురువారం నాడు అరేబియా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ పైలట్‌ని సహాయ బృందాలు రక్షించగా

బుల్లెట్‌కి బలయ్యే అవకాశం ఇవ్వండి.. పెళ్లికి అనుమతిపై మిస్సైన కమాండర్ నిషాంత్‌ హాస్యపూరిత లేఖ.. వైరల్‌
Follow us on

Missing MiG-29K pilot: భారత్‌కి చెందిన మిగ్‌-29కె ఎయిర్‌క్రాఫ్ట్‌ గురువారం నాడు అరేబియా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ పైలట్‌ని సహాయ బృందాలు రక్షించగా.. మరో పైలట్‌ కమాండర్ నిషాంత్ సింగ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది మేలో వివాహం కోసం నిషాంత్ పెట్టుకున్న అర్జీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో తన హాస్యచతురతను నిషాంత్ చూపించారు.

”బుల్లెట్‌ని దింపుకునేందుకు అవకాశం ఇవ్వండి” అంటూ నిషాంత్‌ తన పైఅధికారికి లెటర్‌ పెట్టారు. అందులో ”మూడేళ్ల ట్రయల్స్ తరువాత నేను, నాయబ్‌ రాంధవా ఒక అంగీకారానికి వచ్చాము. మేమిద్దరం ఒకరినొకరు చంపుకోకుండా జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాము. ఈ మహమ్మారి సమయంలో మా పెద్దల నుంచి కూడా అనుమతి లభించింది. జూమ్ వీడియో కాల్‌లో మాకు ఆశీస్సులు తెలిపారు. అందుకే పెళ్లి అనే సమాధిలోకి వెళ్లేందుకు మీ అనుమతి కావాలి. నా ఈ అభ్యర్థనను మీరు పెద్ద మనసుతో అంగీకరిస్తారనుకుంటున్నా. అలాగే మీరు కూడా వచ్చి మీ సంతాపాన్ని తెలుపుతారనుకుంటున్నా. చివరగా మీకు ఇష్టమైన అని రాయాలనుకున్నా. కానీ ఇప్పుడు నేను తనకు ఇష్టమైన” అని ఓ చమత్కార లెటర్‌ని పెట్టారు. దానికి స్పందించిన పైఅధికారి అంతే చమత్కారంగా.. మంచి రోజులన్నీ చివరకు వచ్చేశాయి. నరకానికి స్వాగతం అని తన అనుమతిని ఇచ్చారు. అలాగే నీలో నేను ఒక మెరుపును చూశాను. అందరికంటే నువ్వు భిన్నం అని తన అభిప్రాయాన్ని చెప్పారు.