CORONA EFFECT: పీపీఈ సూట్‏తో గర్ల్ ఫ్రెండ్‏కు పెళ్ళి ప్రపోజల్ చేసిన యువకుడు.. పోస్ట్ వైరల్..

|

Jan 04, 2021 | 5:24 PM

లాక్‏డౌన్ సమయంలో కరోనా వైరస్ నియంత్రణకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చాలావరకు సేవలు అందించిన విషయం తెలిసిందే.

CORONA EFFECT: పీపీఈ సూట్‏తో గర్ల్ ఫ్రెండ్‏కు పెళ్ళి ప్రపోజల్ చేసిన యువకుడు.. పోస్ట్ వైరల్..
Follow us on

లాక్‏డౌన్ సమయంలో కరోనా వైరస్ నియంత్రణకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చాలావరకు సేవలు అందించిన విషయం తెలిసిందే. తమ ప్రాణాలను సైతం పట్టించుకోకుండా కరోనా విజృంభన సమయంలో శరీరానికి పీపీఈ సూట్లను ధరించి.. చాలా మందికి చికిత్స చేశారు. కానీ ఇప్పుడు ఒక యువకుడు అదే పీపీఈ సూట్‏తో తన ప్రియురాలికి పెళ్ళి ప్రపోజల్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇటలీలో ఉన్న పుగ్లియాలో గల ఓస్తునీ ఆసుపత్రిలో పుంన్గేంటే అనే వ్యక్తిగా నర్సుగా పనిచేస్తున్నాడు. రోజూ తన విధుల్లో కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ ఉండడంతో తన గర్ల్ ఫ్రెండ్‏కు పెళ్ళి ప్రపోజల్ చేయలేకపోయాడు. దీంతో తాను నిత్యం ధరించే పీపీఈ సూట్‏తో పెళ్ళి ప్రపోజల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తాను ధరించిన పీపీఈ సూట్ వెనక వైపు కార్మెల్ నన్ను పెళ్ళి చేసుకుంటావా? ఎస్ లేదా నో ? చెప్పు అని రాసుకున్నాడు. అనంతరం ఆ సూట్‏ను ఫోటో తీసి తన ఫేస్‏బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చూశాక అతడి గర్ల్ ఫ్రెండ్ ఆశ్చర్యపోయి.. వెంటనే అతడికి ఓకే చెప్పింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.