Personal Growth: ఆ విషయంలో కుక్కలే మనకు ఆదర్శం.. వాటి నుంచి ఇవి నేర్చుకోవాల్సిందే

| Edited By: TV9 Telugu

May 17, 2024 | 1:32 PM

ఇంతకీ కుక్కలో ఉండే ఆ గొప్ప లక్షణాలు ఏంటి.? వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది విశ్వాసం. విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. శునకాలు తమ యజమానుల పాట్ల విశ్వాసంతో ఉంటాయని మనకు తెలిసిందే. ముఖ్యంగా పెంపుడు శునకాలు యజమానుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి...

Personal Growth: ఆ విషయంలో కుక్కలే మనకు ఆదర్శం.. వాటి నుంచి ఇవి నేర్చుకోవాల్సిందే
Dogs
Follow us on

ఈ సృష్టిలో ప్రతీ జీవి, ప్రతీ చెట్టు మనకు ఏదో ఒక స్ఫూర్తినిస్తుంది. ఏదో ఒక విషయాన్ని చెబుతుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది అనే లైన్‌లో ఎంత మోటివేషన్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెట్లతో పాటు జంతువులు కూడా మనకు ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతాయి. అలాంటి వాటిలో శునకం ఒకటి. కుక్కలు మనకు ఎన్నో విషయాలను చెబుతుంటాయి.

ఇంతకీ కుక్కలో ఉండే ఆ గొప్ప లక్షణాలు ఏంటి.? వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది విశ్వాసం. విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. శునకాలు తమ యజమానుల పాట్ల విశ్వాసంతో ఉంటాయని మనకు తెలిసిందే. ముఖ్యంగా పెంపుడు శునకాలు యజమానుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా ఆహార పదార్ధాలను ముట్టుకోవు. మనుషులు శునకాల నుంచి నేర్చుకోవాల్సిన తొలి అంశం ఈ విశ్వాసమే.

మనకు మంచి చేసిన వారి పట్లతో విశ్వాసంతో ఉండాలనే గొప్ప సందేశాన్ని కుక్కలు మనకు ఇస్తాయి. ఇక యజమాని కోపంలో ఏదైనా తిట్టినా, దండించినా శునకాలు కాసేపటికే అన్ని మర్చిపోయి మళ్లీ కలిసిపోతాయి. అందుకే పొగడ్తలను, విమర్శలను రెండింటినీ సమభావంతో చూసే లక్షణాన్ని శునకాల నుంచి నేర్చుకోవాలని చెబుతుంటారు. క్రమ శిక్షణతో కూడిన జీవితాన్ని కూడా శునకాల నుంచి స్వీకరించాలని చెబుతుంటారు.

శునకాలు యజమాని కనిపించకపోతే అన్నం తినడం మానేస్తాయి. నమ్మిన వారి పట్ల నిబద్ధతో ఉండాలనే విషయాన్ని శునకం చెబుతుంది. అలాగే కుక్కలు ఎలాగైతే తనని కాని వారిని దరి చేరకుండా అరుస్తూ ఉంటుందో అలాగే చెడు గుణాలను మన దరికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. శునకాలు అవసరమైనంత మాత్రమే భోజనం చేస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో కూడా శునకాల నుంచి స్ఫూర్తి పొందాలని చెబతుంటారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..