Vastu Tips: ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.?

|

Mar 03, 2024 | 10:19 PM

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలోనూ వాస్తు వర్తిస్తుందని పండితులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువులు సరైదన దిశలో లేకుంటే, ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. వాస్తు దోషాల వల్ల ఇంట్లో పురోగతి కుంటుపడుతుందని...

Vastu Tips: ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.?
Vastu Tips
Follow us on

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలోనూ వాస్తు వర్తిస్తుందని పండితులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువులు సరైదన దిశలో లేకుంటే, ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. వాస్తు దోషాల వల్ల ఇంట్లో పురోగతి కుంటుపడుతుందని చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఏర్పాటు చేసుకునే చిత్ర పటాల విషయంలోనూ పలు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో ఏ చిత్ర పటాలను ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంట్లో పండ్లు, పువ్వులు, నవ్వుతున్న పిల్లల చిత్రాలు పాజిటివ్‌ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇలాంటి ఫొటోలను తూర్పు లేదా ఉత్తర గోడలపై ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల జీవితంలో సంతోషం వెల్లి విరుస్తుందని చెబుతున్నారు.

* ఇక లక్ష్మీదేవి, కుబేరుల చిత్ర పటాన్ని ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉంచాలని చెబుతున్నారు. ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయి. అలాగే వ్యాపారంలో వృద్ధి లభిస్తుంది.

* నదులు, జలపాతాలు, చెట్లు వంటి ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే చిత్ర పటాలను ఉత్తం లేదా తూర్పు దిశ గోడలకు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుంది.

* ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో రామాయం లేదా మహాభారతంకు సంబంధించిన యుద్ధ సన్నివేశాల ఫొటోలను ఏర్పాటు చేయకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇవి ఇంట్లో అశాంతికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

* ఇక ఏడుస్తున్న పిల్లలు, ఎండిన చెట్లకు సంబంధించిన ఫొటోలను ఇంట్లో పెట్టకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

* ఇంట్లో పక్షుల చిత్రాలను ఏర్పాటు చేసుకోవడం శుభానికి చిహ్నంగా చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం లభిస్తుంది.

* పచ్చని చెట్లు, ఆకాశం, మేఘాలు, చంద్రుడు లాంటి చిత్ర పటాలను పిల్లల పడకగదిలో ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఫొటోలు ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీని పెంచుతాయి. వీటిని తూర్పు, ఉత్తర గోడలపై ఏర్పాటు చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గుర్తించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..