Telangana: పిల్లి బావిలో పడిందని అర్థరాత్రి 12గంటలకు సిటీ కమిషనర్‌కు ఫోన్.. ఆయన ఏం చేశారంటే..?

|

Jun 27, 2022 | 6:40 PM

రాత్రి 12 గంటలకు ఓ యువతి సీటీ కమిషనర్‌కు కాల్ చేసింది. పిల్లి బావిలో పడింది.. దాన్ని కాపాడాలంటూ ఆమె ఫోన్‌లో వేడుకుంది. ఆ యువతిని సముదాయించిన సీపీ.. వెంటనే తన టీమ్‌ను అలెర్ట్ చేశారు....

Telangana: పిల్లి బావిలో పడిందని అర్థరాత్రి 12గంటలకు సిటీ కమిషనర్‌కు ఫోన్.. ఆయన ఏం చేశారంటే..?
Cat Rescue
Follow us on

Karimnagar: కరీంనగర్‌‌లో ఓ క్రేజీ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. సిటీ కమిషనర్‌కి అర్థరాత్రి 12 గంటల టైమ్‌లో ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే పోలీస్ అధికారి కాబట్టి ఆ టైమ్‌లోనూ కాల్ లిఫ్ట్ చేశారు. ఫోన్‌లో ఓ యువతి ఆరాటంగా మాట్లాడటం మొదలెట్టింది. విద్యానగర్‌లోని ఓ ఇంట్లో పిల్లి బావిలో పడిందని, కాపాడాలని ఫోన్ చేసిన యువతి మాటల సారాంశం. పిల్లే కదా అని సీపీ లైట్ తీసుకోలేదు. పిల్లిని రెస్క్యూ చెయ్యాలని టౌన్‌ ఏసీపీ శ్రీనివాసరావును ఆదేశించారు. ఆపై తనకు కాల్ వచ్చిన నంబర్ ఫార్వార్డ్ చేశారు. ఫోన్ చేసిన యువతితో మాట్లాడి వాట్సాప్‌లో లొకేషన్ తెప్పించుకున్నారు పోలీసులు. ఏసీపీ తన టీమ్‌తో అక్కడికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించారు. పిల్లిని కాపాడేందుకు బుట్టకు తాడు కట్టి బావిలోకి వదిలారు పోలీసులు. పావుగంటపాటు ప్రయత్నించి పిల్లిని ఎట్టకేలకు సేఫ్‌గా పైకి తీసుకురాగలిగారు. ఈ విషయం తెలియగానే అటు జంతు ప్రేమికులతో పాటు.. నెటిజన్లు పోలీసులను ప్రశంసిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పనిచేస్తున్నామని.. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా ముందుంటామని కాప్స్ చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..