Fact Check: కర్పూరం వాసన పీలుస్తుంటే.. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలో నిజమెంత?

|

May 30, 2021 | 12:40 PM

Fact Check: కరోనా మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చిన దగ్గరనుంచీ.. చాలా వార్తలు మనల్ని అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా వాట్సప్ గురువులు.. ఫేస్ బుక్ డాక్టర్లూ చెప్పే విషయాల్లో ఏది నిజమో.. ఏది అబద్ధమో అర్ధంకాకుండా పోతోంది.

Fact Check: కర్పూరం వాసన పీలుస్తుంటే.. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలో నిజమెంత?
Fact Check
Follow us on

Fact Check: కరోనా మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చిన దగ్గరనుంచీ.. చాలా వార్తలు మనల్ని అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా వాట్సప్ గురువులు.. ఫేస్ బుక్ డాక్టర్లూ చెప్పే విషయాల్లో ఏది నిజమో.. ఏది అబద్ధమో అర్ధంకాకుండా పోతోంది. ఇంకా చెప్పలంటే ఒక్కోసారి మన చుట్టూ ఇన్ని మందులు ఉన్నాయా అనిపిస్తోంది. కరోనా కోసం సోషల్ మీడియాలో వస్తున్న పరిష్కారాలు మనల్ని నిస్సందేహంగా పిచ్చి వాళ్ళను చేస్తున్నాయనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇటువంటిదే ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫేస్ బుక్.. వాట్సప్ లలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని సారాంశం ఏమిటంటే.. కర్పూరం వాసన పీలిస్తే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని. చాలా మంది దీనిని పాటిస్తున్నారు కూడా.. మరి దీనిలో నిజమెంత? అబద్ధమెంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ విషయాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నారు. (తరువాత ఈ పోస్ట్ తొలగించారు) అసలు ఆ పోస్ట్ ఏం చెబుతుందంటే..“కర్పూరం, లవాంగ్ (లవంగం), అజ్వైన్, కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటన్నిటినీ మిశ్రమంగా చేసి ఒక పొట్లీని (పదార్థాలు ఒక గుడ్డలో చిన్న మూటలా చేయాలి) తయారు చేయండి. రోజంతా ఆ పోట్లీని వాసన చూస్తూ ఉండండి. ఇది ఆక్సిజన్ స్థాయిలు పెంచడానికి సహాయపడుతుంది. ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు లడఖ్ లోని పర్యాటకులకు ఈ పొట్లి ఇస్తారు. ఇది మన పెరటి వైద్యం.”

దీనిగురించి నిపుణులు ఏం చెబుతారో పరిశీలిస్తే..

“కర్పూరం సహజంగా లభించే ముఖ్యమైన నూనె (అస్థిర నూనె). చారిత్రాత్మకంగా, 13 వ శతాబ్దంలో మార్కో పోలో మరియు 1571 లో కామోయెన్స్ కర్పూరం గురించి చెప్పారు. దీనిని ‘వ్యాధి యొక్క బాల్సమ్’ అని పిలిచారు. కర్పూరం చైనీయుల దృష్టిలో ఎంతో విలువైనది, వారు దీనిని ఎంబాలింగ్ ప్రయోజనాల కోసం, సువాసన సబ్బు కోసం ఉపయోగించారు అని తెలుస్తుంది. కర్పూరం ఒక మైనపు, మండే పదార్థం, ఇది బలమైన వాసన కలిగి ఉంటుంది. పరిశోధకులు యంగ్-జిన్ SUE MD, హెడీ పింకర్ట్ MD, హడ్డాడ్, వించెస్టర్ పరిశోధనల్లో క్లినికల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పాయిజనింగ్ అండ్ డ్రగ్ ఓవర్ డోస్ (ఫోర్త్ ఎడిషన్) 2007 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 19 వ శతాబ్దపు ఫార్మాకోపోయియా చికిత్సా ఏజెంట్లలో కర్పూరం ఒకటి.

పై పరిశోధన ప్రకారం, 1983 లో, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ ది కౌంటర్ ఉత్పత్తులలో 11 శాతానికి మించి కర్పూరం ఉండకూడదని చెప్పిని. 1994 లో, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అన్ని ఔషధ ఉత్పత్తుల నుండి కర్పూరం తొలగించాలని సిఫారసు చేసింది. “అయితే, ఈ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, స్థానిక మత్తుమందులు, యాంటీప్రూరిటిక్స్, రూబ్‌ఫేసియంట్స్, యాంటిట్యూసివ్స్, ఇన్హాలెంట్లు వంటి ఓవర్-ది-కౌంటర్ సన్నాహాల్లో కర్పూరం సర్వత్రా కొనసాగుతోంది.

కర్పూరం వైవిధ్యమైన చారిత్రక ఉపయోగాలు ఉన్నప్పటికీ, దీనిని పీల్చడం వల్ల ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడానికి లేదా శ్వాసకోశ బాధ నుండి ఉపశమనం లభిస్తుందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని వైద్యులు తెలిపారు.

“కర్పూరం ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచదు. ఇది కొంతవరకు శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్న రోగులలో ఓదార్పునిస్తుంది, కానీ ఆక్సిజన్ స్థాయిని పెంచదు ”అని ముంబైలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ తుషార్ రాణే అన్నారు. కర్పూరం శాస్త్రీయ ప్రభావం “ఇంకా తెలియదు” కాబట్టి, డాక్టర్ రాణే సోషల్ మీడియా సలహాలను గుడ్డిగా పాటించ కూడదని చెబుతున్నారు. ” ఆక్సిజనేషన్ మెరుగుపరచడానికి కర్పూరం యొక్క ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు అందుబాటులో లేవు. అదేవిధంగా, ఈ వాదనకు మద్దతు ఇవ్వడానికి అధ్యయనం కూడా లేదు. మీ డాక్టర్ సలహా లేకుండా సోషల్ మీడియాలో ఎటువంటి ఫార్వర్డ్లను అనుసరించవద్దు. ఇంటి నివారణలను ప్రయత్నించడం కొన్నిసార్లు ప్రాణాంతకం. కర్పూరం యొక్క శాస్త్రీయ ప్రభావం ఇంకా తెలియదు, ”అని అన్నారు.

ఇదే అభిప్రాయాన్ని చాలా మంది వైద్య నిపుణులు వెల్లడించారు. కర్పూరం పీల్చినపుడు శ్వాస నాళం లో కొద్దిగా హాయి అనిపిస్తుంది. దాంతో ఆక్సిజన్ పెరిగింది అనే భావన కలుగుతుంది. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు అని వారు చెబుతున్నారు.

Also Read: Mushrooms on Mars : అంగారక గ్రహంపై పుట్ట గొడుగులు..! నాసా పంపిన ఫొటోలలో కనిపించేవి అవేనా..? అయోమయంలో శాస్త్రవేత్తలు

WORLD NO TOBACCO DAY- 2021: సిగరెట్ కాల్చేవారికి కొవిడ్ ప్రమాదం ఎక్కువ..! WHO హెచ్చరికలు జారీ..?