Dream: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అయితే మీరు ధనవంతులు అవుతున్నట్లే..

కలలో నిద్ర రావడం సర్వసాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే మన ప్రమేయం లేకుండా మనకు వచ్చే కలల వెనకాల ఎన్నో అర్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కలలో మనకు కనిపించే దృశ్యాలు మన నిజ జీవితంలో జరిగే సంఘటనలతో ముడిపడి ఉంటాయని స్వప్నశాస్త్రం చెబుతోంది....

Dream: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అయితే మీరు ధనవంతులు అవుతున్నట్లే..
Dream

Updated on: Jul 20, 2024 | 7:00 PM

కలలో నిద్ర రావడం సర్వసాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే మన ప్రమేయం లేకుండా మనకు వచ్చే కలల వెనకాల ఎన్నో అర్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కలలో మనకు కనిపించే దృశ్యాలు మన నిజ జీవితంలో జరిగే సంఘటనలతో ముడిపడి ఉంటాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. అలాగే మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇక పండితుల ప్రకారం కలలో కొన్ని కనిపిస్తే ధనవంతులం కాబోతున్నట్లు అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కలలో ఒకవేళ సూర్యుడు కనిపిస్తే త్వరలోనే మీకు ఆస్తి రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఎక్కువ కాంతి కనిపిస్తే మరింత ఎక్కువ ధనం రాబోతోందని సంకేతం. ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అర్థం చేసుకోవాలి.

* కలలో పర్స్‌ కనిపించినా ధన లాభం కలిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. పర్సులో డబ్బులు ఉన్నట్లు కనిపిస్తే వచ్చే రోజుల్లో మీకు ఆర్థికంగా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఒకవేళ పర్సు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి.

* కలలో చంద్రుడు కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. ప్రశాంతతకు చిహ్నమైన జాబిలి కనిపిస్తే కోపం తగ్గి మీకు ప్రశాంతత లభించనుందని తెలుసుకోవాలి.

* మీరు బాగా రడీ అయి ఎక్కడికైనా వెళ్లినట్లే కల వస్తే త్వరలోనే మీరు సంపన్నులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి.

* కలలో అద్దం కనిపిస్తే కూడా మంచి జరగబోతోందని అర్థం చేసుకోవాలి. మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అయితే ఒకవేళ అద్దం పగిలినట్లు కనిపిస్తే.. మాత్రం ఇబ్బంది ఎర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

* బంగారు ఆభరణాలు ధరించినట్లు కనిపిస్తే మీకు అపార సంపదలు వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టిన అన్ని చోట్ల డబుల్‌ రిటర్న్స్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

* ఆవుపాలు పితుకుతున్నట్లు కలలో కనిపిస్తే మీరు త్వరలోనే సంపన్నులు కాబోతున్నట్లు అర్థం చేసుకోవాలి. సంపాదన పెరిగే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us