Dream: ఈ కలలు అస్సలు మంచివి కావంటా.. మరణానికి సంకేతాలు కావొచ్చు.

|

Jul 29, 2024 | 11:48 AM

అయితే కలలో వచ్చే కొన్ని అంశాలు మనకు మంచిని సూచిస్తే. మరికొన్ని మాత్రం చెడుకు సంకేతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కలలో కొన్ని రకాల అంశాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని అంటున్నారు. వీటివల్ల చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంతకీ కలలో ఎలాంటివి కనిపిస్తే చెడుకు సంకేతాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Dream: ఈ కలలు అస్సలు మంచివి కావంటా.. మరణానికి సంకేతాలు కావొచ్చు.
Dream Meaning
Follow us on

ప్రతీ ఒక్కరికీ కలలు రావడం సర్వసాధారణమైన విషయం. రాత్రి మనం పడుకున్న తర్వాత, మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన వాస్తవిక జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. కేవలం శాస్త్రం మాత్రమే కాకుండా సైన్స్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. స్వప్నశాస్త్రంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

అయితే కలలో వచ్చే కొన్ని అంశాలు మనకు మంచిని సూచిస్తే. మరికొన్ని మాత్రం చెడుకు సంకేతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కలలో కొన్ని రకాల అంశాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని అంటున్నారు. వీటివల్ల చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంతకీ కలలో ఎలాంటివి కనిపిస్తే చెడుకు సంకేతాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* కలలో పంది, కోతి, పిల్లి వంటివి కనిపిస్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇవి భవిష్యత్తులో ప్రమాదానికి సంకేతంగా భావించాలని సూచిస్తున్నారు.

* సాధారణంగా నవ్వుతూ, ఆనందంగా మంచికి సంకేతంగా భావిస్తాం. అయితే కలలో ఆనందంగా ఉండడం లేదా వివాహానికి హాజరైనట్లు కనపిస్తే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది మీకేదో ప్రమాదం జరగబోతోందని చెప్పేందుకు సంకేతంగా భావించాలి.

* కలలో ఎవరో తిరుగుతున్నట్లు కనిపిస్తే అది చెడుకు సంకేతంగా భావించాలి. ఇలా కనిపిస్తే మీకు త్వరలోనే సంపద నష్టం జరిగే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి.

* ఎవరైన బ్రాహ్మణ వ్యక్తి కోపంతో ఊగిపోతున్నట్లు కలలో కనిపిస్తే మీరు ప్రమాదపు అంచున ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇది మీకు చెడును సూచిస్తుందని అర్థం చేసుకోవాలి.

* కలలు గేదెలు, గాడిద, ఎలుగుబంటి వంటివి మిమ్మల్ని తరుముతున్నల్లు కలలు రాకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల త్వరలోనే మీరు అనారోగ్యం బారిన పడే అవాకాశాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

* కలలో ఎట్టి పరిస్థితుల్లో సూర్యగ్రహణం, లేదా చంద్ర గ్రహాణం వంటివి కనిపిస్తే అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది మరణానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు.

* నల్లటి వస్త్రాలు ధరించిన మహిళలు కలలో కనిపిస్తే మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ప్రాణ హాని ఉంటుందని అర్థం చేసుకోవాలి.

* జుట్టు, గోళ్లు కత్తిరించుకుంటున్నట్లు కలలో కనిపించినా అది అపశకునానికి సంకేతంగా భావించాలి. దీనివల్ల చెడు జరగబోతుందని అర్థం చేసుకోవాలి.

* కలలో కాకి దాడి చేస్తుననట్లు కనిపిస్తే కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది మరణ భయానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..