ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌ను దరఖాస్తు చేసుకోండిలా..!

|

Nov 16, 2019 | 8:13 PM

ఆధార్, ప్యాన్ కార్డు ఎంత అవసరమో.. పాస్‌పోర్టు కూడా అన్ని పనులకు అంతే ముఖ్యమని చెప్పాలి. ఇక ఈ పాస్‌పోర్టును చాలా సులభంగా మీ ఇంటి దగ్గర నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సర్వీసులన్నీ ఆన్లైన్ బాట పట్టినప్పుడు పాస్‌పోర్టు సేవలను కూడా కేంద్రం ఆన్‌లైన్ చేసేసింది. ఇక ఆన్లైన్‌లో అఫిషియల్ పాస్‌పోర్ట్‌ సేవా వెబ్‌సైట్ ద్వారా పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అఫీషియల్/ డిప్లమేటిక్ పాస్‌పోర్ట్‌‌ను ఆన్లైన్ ద్వారా అప్లై చేసే విధానం… […]

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌ను దరఖాస్తు చేసుకోండిలా..!
Follow us on

ఆధార్, ప్యాన్ కార్డు ఎంత అవసరమో.. పాస్‌పోర్టు కూడా అన్ని పనులకు అంతే ముఖ్యమని చెప్పాలి. ఇక ఈ పాస్‌పోర్టును చాలా సులభంగా మీ ఇంటి దగ్గర నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సర్వీసులన్నీ ఆన్లైన్ బాట పట్టినప్పుడు పాస్‌పోర్టు సేవలను కూడా కేంద్రం ఆన్‌లైన్ చేసేసింది. ఇక ఆన్లైన్‌లో అఫిషియల్ పాస్‌పోర్ట్‌ సేవా వెబ్‌సైట్ ద్వారా పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

అఫీషియల్/ డిప్లమేటిక్ పాస్‌పోర్ట్‌‌ను ఆన్లైన్ ద్వారా అప్లై చేసే విధానం…

  1. ముందుగా పాస్‌పోర్టు సేవా అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. రిజిస్టర్ లింక్‌ను క్లిక్ చేయాలి.
  2. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో పాస్‌పోర్టు సేవా ఆన్లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
  3. హోమ్‌పేజీలో కనిపించే అప్లై బటన్‌పై క్లిక్ చేయాలి.
  4. ఆ తర్వాత పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన ఫారమ్‌ను కావాల్సిన డాక్యుమెంట్స్‌తో పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
  5. ఇక పూర్తి చేసిన అప్లికేషన్ ప్రింట్ ఔట్‌ను ‘వ్యూ/ప్రింట్ సబ్మిటెడ్ ఫామ్ లింక్ ద్వారా తీసుకోవచ్చు. ఈ లింక్ ‘వ్యూ సేవ్డ్/సబ్మిటెడ్ అప్లికేషన్స్ పేజీలో దొరుకుతుంది.
  6. ద‌ర‌ఖాస్తు ఫామ్ ప్రింట్, సంబంధిత ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను పాస్‌పోర్ట్ కార్యాలయానికి తీసుకెళ్లాలి.