అడవినే గడగడలాడించే అతిపెద్ద పాము.. ఎంత పెద్ద జంతువైన ఒక్క సెకన్‌లోనే..

అది నీటిలో నిశ్శబ్దంగా కదులుతున్నప్పుడు పచ్చని ఆకుల మధ్య కలిసిపోతుంది. ఒక్కసారి ఇతర జీవాలపై దాడి చేసిందంటే గజరాజుకైనా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. అమెజాన్ అడవులకే ప్రత్యేకాకర్షణగా నిలిచే భారీ అనకొండల జీవనశైలి, వాటిలోని రకాలు, వాటికున్న అసాధారణ బలాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అడవినే గడగడలాడించే అతిపెద్ద పాము.. ఎంత పెద్ద జంతువైన ఒక్క సెకన్‌లోనే..
World Largest Snake Green Anaconda

Updated on: Apr 08, 2026 | 2:13 PM

భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన, ఆశ్చర్యకరమైన జీవులలో అనకొండలు ఒకటి. ముఖ్యంగా అమెజాన్ వర్షారణ్యాల్లో సంచరించే గ్రీన్ అనకొండ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. దీనిని కేవలం పాము అని పిలిస్తే తప్పు అవుతుంది.. ఇది అడవికి, నీటి సామ్రాజ్యానికి అసలైన రాజు. తాజా పరిశోధనల ప్రకారం ఈ భారీ సర్పం గురించిన ఆసక్తికర విశేషాలు వెలుగులోకి వచ్చాయి. గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అత్యంత పొడవైనది కాకపోవచ్చు.. కానీ అత్యంత బరువైన పాము మాత్రం ఇదే. ఇది దాదాపు ఇద్దరు లేదా ముగ్గురు మనుషుల బరువుకు సమానంగా ఉంటుంది. సాధారణంగా 15 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతుంది. విశేషమేమిటంటే.. మగ పాముల కంటే ఆడ అనకొండలే పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి.

నీటిలో వేగం.. భూమిపై భారతం

అనకొండ శరీర నిర్మాణం నీటిలో వేగంగా ఈదడానికి అనువుగా ఉంటుంది. దీని కళ్లు, ముక్కు తల పైభాగంలో ఉండటం వల్ల, నీటిలో మునిగి ఉన్నా బయట ఏం జరుగుతుందో గమనించగలదు. అయితే భూమిపై మాత్రం దీని భారీ శరీరం వల్ల చాలా నెమ్మదిగా కదులుతుంది. అందుకే ఇది ఎక్కువగా నీటి వనరుల దగ్గరే గడుపుతుంది.

వేటాడే పద్ధతి: ఊపిరాడకుండా చేసి..

అనకొండకు విషం ఉండదు. కానీ దీని కండరాల బలం మామూలుగా ఉండదు. తన ఎరను చుట్టుముట్టి, ఎముకలు విరిగేలా గట్టిగా నొక్కి, ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఆ తర్వాత తనకంటే పెద్దదైన జంతువును కూడా దవడలు విడదీసి మొత్తం మింగేస్తుంది. ఒక్కసారి భారీ వేట దొరికితే, ఆహారం లేకుండా నెలల తరబడి జీవించగలదు.

అనకొండల్లో రకాలు

అనకొండలు అనగానే మనకు పచ్చ అనకొండ మాత్రమే తెలుసు. కానీ ఇందులో ప్రధానంగా 4 రకాలు ఉన్నాయి..

గ్రీన్ అనకొండ: అన్నింటికంటే పెద్దది, బలమైనది.

పసుపు అనకొండ: ఇది కొంచెం చిన్నది (10-13 అడుగులు). పరాగ్వే నదీ ప్రాంతంలో కనిపిస్తుంది.

నల్ల మచ్చల అనకొండ: ఇది చాలా అరుదు. దీనిపై ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది.

బొలీవియన్ అనకొండ: ఇది ఇటీవల గుర్తించిన జాతి, బొలీవియాలో ఎక్కువగా కనిపిస్తుంది.

అమెజాన్ అడవులే వీటికి ప్రాణం

అక్కడి ఉష్ణోగ్రత, తేమతో కూడిన వాతావరణం అనకొండల మనుగడకు కీలకం. అందుకే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇవి సహజంగా కనిపించవు. ఇవి మనుషులకు దూరంగా ఉండటానికే ఇష్టపడతాయి, కానీ వాటి నివాస ప్రాంతాల్లోకి వెళ్తే మాత్రం ప్రాణాపాయం తప్పదు.

Follow Us