Chewing Gum: చూయింగ్ గమ్ నమలడమే ఆమె పని.. ఎంత సంపాదిస్తుందో తెలిస్తే గుండె గుభేలే..!

|

Jul 29, 2022 | 7:55 PM

Chewing Gum: చాలా మందికి చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఒక విధంగా ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది.

Chewing Gum: చూయింగ్ గమ్ నమలడమే ఆమె పని.. ఎంత సంపాదిస్తుందో తెలిస్తే గుండె గుభేలే..!
Chewing Gum
Follow us on

Chewing Gum: చాలా మందికి చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఒక విధంగా ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. బరువును తగ్గించడంతో పాటు, నోటికి వ్యాయామం కూడా అవుతుంది. చూయింగ్ గమ్ మౌత్ ఫ్రెష్‌నర్‌గా మాత్రమే కాకుండా, నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని నమిలితే కోటీశ్వరులు అవుతారని మీకు తెలుసా? ఓ మహిళ కేవలం చూయింగ్ నమలడం ద్వారా నెలకు అర లక్షకు పైగా డబ్బు సంపాదిస్తుంది. అవును, మీరు చదివింది నిజంగా నిజం. ఇప్పుడు ఈమె సంపాదనే హాట్ టాపిక్‌గా మారింది.

జర్మనీకి చెందిన 30 ఏళ్ల జూలియా ఫోరాట్.. చూయింగ్ గమ్ నములుతూ నెలకు రూ. 67 వేలకు పైగా సంపాదిస్తుంది. అది కూడా పార్ట్‌టైమ్ గానే కావడం విశేషం. వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్ అయిన జూలియా.. పార్ట్ టైమ్‌గా చూయింగ్ నములుతూ భారీగా సంపాదించేస్తుంది.

480 రూపాయల పెట్టుబడితో..
ఈ పనికి పెద్దగా పెట్టుబడి ఖర్చు కూడా లేదండోయ్. చూయింగ్ గమ్‌లను కొనడానికి జస్ట్ 5 ఫౌండ్లు, భారత కరెన్సీలో 480 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతుంది. అలా కొన్న చూయింగ్ గమ్‌ లను నములుతూ.. బెలూన్‌ల కంటే పెద్ద బుడగలు చేసి చూపిస్తుంది. ఈ బుడగలు చేస్తూ.. వాటిని ఫోటోలు తీసి విక్రయిస్తుంది. అలా ఏక కాలంలో 20 నుంచి 30 చూయింగ్ గమ్‌లను నములుతుంది. ఇలా బుడగలతో నెలకు వేలాది రూపాయలు సంపాదిస్తోంది. కొంతమంది.. ఆ బుడగలను తమకు నచ్చినట్లుగా చేయాలని కోరడంతో.. అలా కూడా చేస్తోంది జూలియా. దాంతో ఆమె సంపాదన మరింత పెరుగుతోంది. మొత్తానికి ఇలా చూయింగ్ గమ్‌తో గట్టిగానే సంపాదిస్తోంది జూలియా.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..