General Knowledge: ఏనుగు దంతాలు బంగారం కంటే ఖరీదైనవి.. కారణం ఏంటో తెలుసా?

|

Aug 15, 2022 | 6:51 PM

General Knowledge: ఏనుగు దంతాల స్మగ్లింగ్ గురించి తరచుగా వింటూనే ఉంటాం. ఏనుగు దంతాలు అక్రమంగా తరలిస్తున్న వారి అరెస్ట్ అంటూ నిత్యం ఏక్కడోచోట వార్తలు వస్తూనే ఉంటాయి.

General Knowledge: ఏనుగు దంతాలు బంగారం కంటే ఖరీదైనవి.. కారణం ఏంటో తెలుసా?
Elephant
Follow us on

General Knowledge: ఏనుగు దంతాల స్మగ్లింగ్ గురించి తరచుగా వింటూనే ఉంటాం. ఏనుగు దంతాలు అక్రమంగా తరలిస్తున్న వారి అరెస్ట్ అంటూ నిత్యం ఏక్కడోచోట వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే, ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేయాల్సిన అంత అవసరం ఏంటి? ఆ దంతాలుకు ఎందుకంత డిమాండ్? అంత స్పెషల్ వాటిలో ఏముంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. అవును, ఏనుగు దంతాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంటుంది. అవి బంగారం కంటే కూడా విలువైనది. అందుకే స్మగ్లర్లు.. ఏనుగు దంతాలను అక్రమంగా తరలించి, విక్రయాలు చేస్తుంటారు. మరి ఏనుగు దంతాలు అంత ఖరీదైనవి కావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆభరణాల తయారీ..
ఆభరణాల తయారీకి ఏనుగు దంతాలను ఉపయోగిస్తారు. మెడలో వేసుకునే నెక్లెస్, బ్యాంగిల్స్, మణికట్టుకు పెట్టుకునే బటన్స్ వంటి ఆభరణాలు తయారచేస్తారు. ముఖ్యంగా ఉన్నతవర్గాల్లో దీనిని స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఈ కారణంగా ఏనుగు దంతాలకు ఖరీదు ఎక్కువ.

చరిత్రతో ముడిపడి ఉన్న అంశాలు..
ఏనుగు దంతాలతో చేసిన ఆభరణాలు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి. పురాతన కాలంలో రాజకుటుంబీకులు, ప్రముఖులు ఏనుగు దంతాలతో చేసిన ఆభరణాలను ఎక్కువగా కోరుకునేవారు. ఇది అనేక ప్రత్యేక ప్రదేశాలలో, సాధారణ సంస్కృతిలో భాగం. అందుకే.. బంగారం కంటే కూడా ఏనుగు దంతాలు అత్యంత ఖరీదు చేస్తున్నాయి.

మతపరమైన కారణాలు కూడా..
మతపరమైన కారణాలు, విశ్వాసాల కారణంగా కూడా ఏనుగు దంతాలకు డిమాండ్ ఉంది. హిందూ దేవుడు అయిన వినాయకుడి ముఖం ఏనుగు ముఖ రూపంలో ఉంటారనే విషయం తెలిసిందే. ఈ కారణంగానూ ఏనుగు దంతాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

దంతాల అక్రమ వ్యాపారం..
అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఏనుగు కూడా ఒకటి. స్మగ్లర్లు ఏనుగు దంతాల కోసం ఏనుగులను చంపేస్తున్నారు. ఈ కారణంగా కూడా ఏనుగులు అంతరించిపోతున్నారు. దాంతో దంతాల వ్యాపారాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. వణ్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 9 ప్రకారం ఏనుగు దంతాలు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..