fuel rate today : సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారుల జేబుకు చిల్లే…

|

Jan 19, 2021 | 6:15 AM

పెట్రోల్ , డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పెట్రోలుపై 25 పైసలు పెరగడంతో ఏపీలో పెట్రోల్ ధర 100చేరువలో ఉంది....

fuel rate today : సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారుల జేబుకు చిల్లే...
Follow us on

fuel rate today : పెట్రోల్ , డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పెట్రోలుపై 25 పైసలు పెరగడంతో ఏపీలో పెట్రోల్ ధర 100చేరువలో ఉంది. ఇప్పటికే విశాఖపట్నం మినహా అన్నజిల్లాలో పెట్రోల్ ధర 90కి పైనే ఉంది. ఇక డీజిల్‌ ధర కూడా 26 పైసలు పెరిగింది. ఈ పెంపుతో రాష్ట్రంలో డీజిల్‌ ధర 84 దాటిపోయింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.88.37గా ఉంటే, గుంటూరులో రూ.91.06గా ఉంది. విశాఖపట్నంలో మాత్రం పెట్రోలు ధర ప్రస్తుతానికి రూ.89.87గా ఉంది. డీజిల్‌ ధర హైదరాబాద్‌లో 81.97 అయితే, గుంటూరులో రూ.84.21.గా ఉంది. ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేట్లు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.95, డీజిల్ రూ. 77.13, ముంబైలో పెట్రోల్ రూ 91.56 , డీజిల్ రూ.81.87 , చెన్నై పెట్రోల్ రూ 87.63 , డీజిల్ 80.47 గా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Uppena Movie : త్వరలో తీరాన్ని తాకనున్న ‘ఉప్పెన’.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే…