Vastu Tips: పిల్లలు చదువుల్లో రాణించాలా.? ఈ వాస్తు టిప్స్‌ పాటించండి..

|

Aug 08, 2024 | 7:02 PM

మనలో చాలా మందిని వాస్తును తప్పకుండా పాటిస్తుంటారు. అందుకే ఇళ్లు నిర్మాణం అనే ఆలోచన వచ్చిన వెంటనే తొలుత చేసే పని వాస్తు పండితులను సంప్రదిస్తుంటారు. వాస్తు పండితుల అభిప్రాయాలకు, సూచనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు. అయితే ఇంట్లో ప్రతీ అంశంలో వాస్తు వర్తించినట్లే చిన్నారుల చదువుల విషయంలో కూడా వాస్తు ఉంటుందని..

Vastu Tips: పిల్లలు చదువుల్లో రాణించాలా.? ఈ వాస్తు టిప్స్‌ పాటించండి..
Vastu Tips
Follow us on

మనలో చాలా మందిని వాస్తును తప్పకుండా పాటిస్తుంటారు. అందుకే ఇళ్లు నిర్మాణం అనే ఆలోచన వచ్చిన వెంటనే తొలుత చేసే పని వాస్తు పండితులను సంప్రదిస్తుంటారు. వాస్తు పండితుల అభిప్రాయాలకు, సూచనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు. అయితే ఇంట్లో ప్రతీ అంశంలో వాస్తు వర్తించినట్లే చిన్నారుల చదువుల విషయంలో కూడా వాస్తు ఉంటుందని చెబుతున్నారు. చిన్నారులు చదువుల్లో బాగా రాణించాలన్నా, మంచి మార్కులు సాధించాలన్నా కొన్ని రకాల వాస్తు నియమాలు పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ వాస్తు పండితులు సూచిస్తున్న ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

* చిన్నారులు చదువుకోవడానికి కచ్చితంగా ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయండ. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ గది తూర్పు లేదా పడమర దిశలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మంచి జరుగుతుందని అంటున్నారు.

* ఇక స్టడీ రూమ్‌లోకి గాలి, వెలుతురు బాగా వచ్చే చూసుకోవాలి. సహజంగానే గది తూర్పు దిశలో ఉంటుంది కాబట్టి ఉదయం లేచిన వెంటనే సూర్య కిరణాలు గదిలోకి వస్తాయి. ఇది చిన్నారుల్లో చురుకుదనాన్ని పెంచుతుంది.

* వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్టడీ రూమ్‌లో వేసే కలర్స్‌ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా లైట్‌ గ్రీన్‌, బ్లూ, యెల్లో, వైట్ వంటి కలర్‌లు వేస్తే మంచిది. ఈ కలర్‌లు వారిలో ఏకాగ్రతను పెంచుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ముదురు రంగు కలర్స్‌ను ఉపయోగించకూడదు.

* ఇక వాస్తు నియమం ప్రకారం.. స్టడీ రూమ్‌లో చిన్నారుల కోసం ఏర్పాటు చేసే నీటి సదుపాయం ఈశాన్య దిశలో ఉండేలా జాగ్రత్త పడాలి.

* వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం చిన్నారుల స్టడీ రూమ్‌లో గణపతి లేదా సరస్వతీ దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చిన్నారుల్లో ఏకాగ్రత పెరుగుతుందని అంటున్నారు

* చిన్నారులు పరీక్షలు ప్రశాంతంగా రాయలన్నా, ఏకాగ్రత పెరగాలన్నా వారికి గాయత్రీ మంత్రాన్ని పఠించమని చెప్పండి. గాయత్రి మంత్రాన్ని వారికి నేర్పించండి.

* వీటితో పాటు మనసు ప్రశాంతంగా ఉంచేందుకు యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేయాలని మానసిక నిపుణులు సైతం సూచిస్తుంటారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..