Vastu Tips: మీ పిల్లలు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారా.? వాస్తు లోపాలు సరిచేసుకోండి

|

Jul 26, 2024 | 11:59 AM

వాస్తు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా వాస్తు లోపాలు ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా ఇంట్లో పిల్లలపై కూడా వాస్తు ప్రభావం చూపిస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే కొన్ని రకాల వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలని...

Vastu Tips: మీ పిల్లలు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారా.? వాస్తు లోపాలు సరిచేసుకోండి
Vastu Tips
Follow us on

వాస్తు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా వాస్తు లోపాలు ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా ఇంట్లో పిల్లలపై కూడా వాస్తు ప్రభావం చూపిస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే కొన్ని రకాల వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలని పండితులు అంటున్నారు. మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంట్లో పిల్లలు ఉండే గది విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గదిలో వేసే కలర్స్‌ విషయంలో పలు నియమాలు పాటించాలి. ముఖ్యంగా పిల్లల గదిలో గులాబీ, ఆకుపచ్చ, నీలం కలర్స్‌ పెయింట్స్‌ను వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ముదురు రంగు కలర్స్‌ను ఉపయోగించకూడదు. ఇది చిన్నారుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

* చిన్నారులు ఉండే గదిలోకి కచ్చితంగా మంచి కాంతి, వెంటిలేషన్‌ వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. గదిలోకి వెలుతురు, గాలి వస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఉదయం లేవగానే గదిలోకి సన్‌లైట్ వస్తే విటమిన్‌ డి లభిస్తుంది. ఇది చిన్నారుల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

* చిన్నారలు పడుకునే బెడ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు పడుకునే సమయంలో వారి తల తూర్పు లేదా దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

* పిల్లల బెడ్‌రూమ్‌లో అద్దం లేకుండా చూసుకోండి. ముఖ్యంగా పడుకున్న సమయంలో వారు అద్దంలో కనిపిస్తే రాత్రుళ్లు పీడ కలలు వచ్చే అవకాశం ఉంటుంది.

* ఇక చిన్నారుల స్టడీ రూమ్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. స్టడీ రూమ్‌ ఈశాన్యం దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాగే తూర్పు, ఉత్తరం కూడా స్టడీ ప్లేస్‌కు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

* పిల్లలు ఉండే గది నిత్యం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చెత్తాచెదారం ఉండడం వల్ల వారి గదిలో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి వారి గదులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..