Vastu Tips: ఇవి చేస్తే చాలు.. ఎలాంటి వాస్తు దోషమైనా పరార్‌ అంతే..

|

Jul 29, 2024 | 12:55 PM

మనకు తెలిసో తెలియకో పలు వాస్తు తప్పులు చేస్తుంటాం. అయితే ఇంట్లోని ఈ చిన్న చిన్న వాస్తు దోషాలు పలు సమస్యలకు దారి తీస్తాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అందుకే వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తుంటారు. అయితే ఇంట్లో ఉండే చిన్న చిన్న వాస్తు దోషాల నివారణకు కొన్ని చిట్కాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు...

Vastu Tips: ఇవి చేస్తే చాలు.. ఎలాంటి వాస్తు దోషమైనా పరార్‌ అంతే..
Vastu
Follow us on

మనకు తెలిసో తెలియకో పలు వాస్తు తప్పులు చేస్తుంటాం. అయితే ఇంట్లోని ఈ చిన్న చిన్న వాస్తు దోషాలు పలు సమస్యలకు దారి తీస్తాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అందుకే వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తుంటారు. అయితే ఇంట్లో ఉండే చిన్న చిన్న వాస్తు దోషాల నివారణకు కొన్ని చిట్కాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఇంట్లో ఉండే వాస్తు దోషాల నివారణకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. క్రమంతప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా వారానికి ఒక్కసారైనా ఇంటిని ఉప్పు నీటితో తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇదిలా వాస్తు దోషాలను తొలగిస్తుంది.

* ఇంట్లో మరుగుదొడ్డి కచ్చితంగా వాస్తు ప్రకారంగా ఉండాలి. ఒకవేళ బాత్‌రూమ్‌ వాస్తుకు అనుగుణంగా లేకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అందుకే ఈ దోష నివారణ కోసం ఒక గాజు గిన్నెలో దొడ్డు ఉప్పు వేసి బాత్‌రూమ్‌లో ఓ మూలన ఉంచాలి. ఇలా ప్రతీ రెండు నెలలకు ఒకసారి ఉప్పును మార్చుతూ ఉండాలి. ఇలా చేస్తే నెగిటివ్‌ ఎనర్జీ దూరమవుతుంది.

* ఇంట్లో ఏదైనా నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లుయితే దానిని తగ్గించుకోవడానికి రాతి ఉప్పును ఉపయోగించాలి. ఇంట్లోని ప్రతీ గదిలో మూలన ఒక గాజు ప్లేట్‌లో రాతి ఉప్పును ఉంచాలి. దీనివల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. నెగిటివ్‌ ఎనర్జీ తగ్గిపోతుంది.

* కలలో పీడ కలలు వస్తుంటే ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వస్తుంటే.. పడుకునే సమయంలో మీ తల దగ్గర గాజు ప్లేట్‌లో పటికను ఉంచాలి. ఇది పీడకలలను అడ్డుకోవడంలో ఉపయోగపడుతుంది.

* మీరు ఏ పనిమీద ఆసక్తి చూపలేకపోతున్నా.. మనసు ప్రశాంతంగా లేకపోయినా ఇంట్లో హాల్‌లో పటిక ముక్కను ఉంచాలి. ఇలా చేయడం వల్ల ప్రశాతంత లభిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..