Vastu Tips: బెడ్‌ రూమ్‌లో ఈ వస్తువులు ఉన్నాయా.? వెంటనే తీసేయండి, లేదంటే..

|

Jul 28, 2024 | 1:22 PM

ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో ప్రతీ నిర్మాణం వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. వాస్తు నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతుంటారు. అయితే ఇంట్లో పడకగది మరింత ఎంతో ప్రత్యేకత ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. బెడ్‌ రూమ్‌ వాస్తుకు అనుగుణంగా లేకపోతే...

Vastu Tips: బెడ్‌ రూమ్‌లో ఈ వస్తువులు ఉన్నాయా.? వెంటనే తీసేయండి, లేదంటే..
Vastu Tips
Follow us on

ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో ప్రతీ నిర్మాణం వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. వాస్తు నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతుంటారు. అయితే ఇంట్లో పడకగది మరింత ఎంతో ప్రత్యేకత ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. బెడ్‌ రూమ్‌ వాస్తుకు అనుగుణంగా లేకపోతే. ఎన్నో రకాల మానసిక సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే బెడ్ రూమ్‌ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల వస్తువులు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఎట్టి పరిస్థితుల్లో అద్దం ఉంచకూడదు. మరీ ముఖ్యంగా మంచం అద్దంలో ప్రతిబింబించకుండా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల నిద్రకు భంగం కలగడమే కాకుండా రాత్రుళ్లు పీడ కలలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే బెడ్ రూమ్‌లో అద్దం ఉండకూడదు. డ్రెస్సింగ్ టేబుల్స్‌ను కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఒకవేళ అద్దం కచ్చితంగా ఉండాలని అనుకుంటే అద్దంలో మంచం పడకుండా చూసుకోవాలి.

* ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. స్వ‌చ్ఛ‌మైన గాలి కోసం, మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం ఇంట్లో మొక్కలు పెంకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో.. స్పైకీ లేదా ప్రిక్లీ మొక్కలు శక్తి ప్రవాహాన్నికి ఆటంకం కలిగిస్తాయి. ఇవి మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. అందుకే మృదువైన మొక్కలను పెంచుకోవాలని చెబుతున్నారు.

* ఇటీవల బెడ్‌రూమ్‌లో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ పెట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. సెల్‌ఫోన్స్‌, ట్యాబ్స్‌, ల్యాప్‌టాప్స్‌లను పడకగదిలో వాడుతున్నారు. అయితే కేవలం వాస్తు పరంగా మాత్రమే కాకుండా. సైన్స్ ప్రకారం కూడా ఇలాంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను పడకగదిలో ఉంచుకోవడం వల్ల వీటి రేడిషన్‌ కారణంగా నిద్రలేమి వంటి సమస్యలకు కారణమవుతుంది.

* బెడ్‌ రూమ్‌లో ఉండకూడని మరో ముఖ్యమైంది. పగిలిన వస్తువులు. బెడ్ రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో పగిలిపోయిన వస్తువుల ఉండకుండా చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్‌లో ఇలాంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల దంపతుల మధ్య నిత్యం గొడవలు, అశాంతి నెలకొంటుంది. అలాగే అన్నింటా అడ్డంకులు ఏర్పడుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి. కాబట్టి బెడ్ రూమ్‌లో పగిలిన వస్తువులు ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..