Tamil Nadu : మూగ జీవిపై పైశాచికత్వం.. ఏనుగుకు నిప్పు అంటించిన మానవత్వం లేని మనుషులు..

| Edited By: Narender Vaitla

Jan 23, 2021 | 6:43 AM

ఇటీవల కాలం లో వన్య పరాణులు జనావాసంలోకి వస్తుండటం తరచు చూస్తున్నాం. చిరుతలు, జింకలు, ఏనుగులు అడవులను వదిలి జనావాసంలోకి వస్తున్నాయి...

Tamil Nadu : మూగ జీవిపై పైశాచికత్వం.. ఏనుగుకు నిప్పు అంటించిన మానవత్వం లేని మనుషులు..
Follow us on

Tamil Nadu : ఇటీవల కాలంలో వన్య పరాణులు జనావాసంలోకి వస్తుండటం తరచు చూస్తున్నాం. చిరుతలు, జింకలు, ఏనుగులు అడవులను వదిలి జనావాసంలోకి వస్తున్నాయి. అలా వచ్చిన ఓ ఏనుగు మనుషులు చేసిన పనికి ప్రాణాలు కోల్పోయింది. చెన్నైలోని తమిళనాడులోని నీలగిరి అటవీ ప్రాంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. అడవుల్లోనుంచి జనావాసంలోకి వచ్చిన ఓ ఏనుగును తరిమేందుకు అక్కడి స్థానికులు అరుపులు, డప్పులతో దానిని భయపెట్టే ప్రయత్నం చేశారు. కాగా వారిలో కొందరు ఓ టైరుకు నిప్పు పెట్టి ఏనుగు పైకి విసిరారు. ఆ టైర్ ఏనుగు చెవికి చిక్కుకుంది. దాంతో ఆ ఏనుగు బాధతో విలవిలలాడింది.. చెవికి చిక్కుకున్న టైరును తొండంతో తీసే ప్రయత్నం చేసిన తొండంకు కూడా గాయాలయ్యాయి. దాంతో ఆ భాదను భరించలేక ఆ ఏనుగు అడవిలోకి పరుగులు తీసింది. ఆతర్వాత తల వెనుక, చెవుల వద్ద, తొండం దగ్గర తీవ్రంగా కాలిన గాయాలతో పడి ఉన్న ఆ ఏనుగును అటవీ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ ఏనుగును చికిత్సనందించేందుకు శిబిరానికి తరలించే క్రమంలో ఆ ఏనుగు మరణించింది. కాగా ఏనుగు కు నిప్పు అంటించిన వారిలో ఇద్దరిని అరెస్ట్‌ చేయగా మరొక వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఏనుగుకు నిప్పుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ దారుణాన్ని ఖండిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Acharya Movie : ‘ఆచార్య’ సెట్‌‌‌‌‌లో అడుగు పెట్టనున్న మరో హీరోయిన్.. చరణ్‌‌‌కు జోడీగా బుట్టబొమ్మ..?