E Challan: ఒక రోజులో చలాన్‌ని ఎన్నిసార్లు విధించొచ్చు.. కీలక సమాచారం మీకోసం..

|

Sep 13, 2023 | 10:17 AM

ఒకసారి చలాన్ పడితే.. మళ్లీ ఆ రోజంతా చలాన్ పడదని, ఆ రోజంతా ఆనందంగా తిరుగొచ్చని చాలా మంది అనుకుంటారు. దాదాపు అందరూ ఇదే అనుకుంటారు. అయితే, దీనికి సంబంధించి అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి దీనికి సంబంధించిన వాస్తవం తెలియదు. అయితే, చలాన్లకు సంబంధించిన ఈ నిజం తెలిస్తే మాత్రం ఇంకెప్పుడు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. భారీ చలాన్ నుంచి తప్పించుకుంటారు. వాస్తవానికి ఏదైనా కారు/బైక్‌ పై రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు చలాన్ వేసే అవకాశం ఉంటుంది.

E Challan: ఒక రోజులో చలాన్‌ని ఎన్నిసార్లు విధించొచ్చు.. కీలక సమాచారం మీకోసం..
E Challan
Follow us on

ఒకసారి చలాన్ పడితే.. మళ్లీ ఆ రోజంతా చలాన్ పడదని, ఆ రోజంతా ఆనందంగా తిరుగొచ్చని చాలా మంది అనుకుంటారు. దాదాపు అందరూ ఇదే అనుకుంటారు. అయితే, దీనికి సంబంధించి అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి దీనికి సంబంధించిన వాస్తవం తెలియదు. అయితే, చలాన్లకు సంబంధించిన ఈ నిజం తెలిస్తే మాత్రం ఇంకెప్పుడు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. భారీ చలాన్ నుంచి తప్పించుకుంటారు. వాస్తవానికి ఏదైనా కారు/బైక్‌ పై రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు చలాన్ వేసే అవకాశం ఉంటుంది.

ఒకసారి చలాన్ వేస్తే మరోసారి రాదా?

రోజుకు ఒకసారి చలాన్ చేసిన తర్వాత రెండోసారి ఛాలాన్ వేయరని అనుకోవద్దు. అది మీరు చేసే పొరపాట్లపై, ఉల్లంఘనలపై ఆధారపడి ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో రోజుకు ఒకసారి చలాన్ వేసిన తర్వాత మళ్లీ చలాన్ వేయకపోవచ్చు. అయితే ఇది ప్రతి సందర్భంలో అలాగే ఉండదు. ఉదాహరణకు.. మీరు రోజులో ఒకసారి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే.. ఫైన్ వేస్తారు అధికారులు. అదే రోజు మళ్లీ అదే ఉల్లంఘనకు పాల్పడితే.. చలాన్ జారీ చేయకపోవచ్చు. అయితే, ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. ఏదైనా నియమాన్ని పదే పదే ఉల్లంఘిస్తే.. ఒక్కసారి మాత్రమే కాకుండా.. మరో చలాన్ కూడా విధించే అవకాశం ఉంది.

హెల్మెట్ లేకుండా బైక్, స్కూటర్‌పై ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన కిందకు వస్తుంది. అయితే, హెల్మెట్ కోసం మళ్లీ ఇంటికి వెళ్లలేరు కాబట్టి.. ఆ రోజుకు ఒక్క చలాన్‌తో సరిపెడతారు అధికారులు. అయితే, అదే రోజు హెల్మెట్ ఉల్లంఘన కాకుండా.. మరే ఇతర తప్పు చేసినా ఫైన్ వేస్తారు అధికారులు.

ఇ చలాన్

నిబంధనలను ఉల్లంఘించిన ప్రతిసారీ.. అంటే ఓవర్ స్పీడ్, రెడ్ లైట్ క్రాసింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే.. వెంటనే చలాన్ జారీ చేయడం జరుగుతుంది. ఒక్కసారి చలాన్ జారీ చేసిన తర్వాత రెండోసారి జారీ చేయరని అంతా భావిస్తారు. కానీ, అందులో నిజం లేదు. మీరు మళ్లీ మళ్లీ అవే ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే.. ఒక రోజులో చాలా చలాన్లు విధించే అవకాశం ఉంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..