Broiler: బ్రాయిలర్ చికెన్ తింటే సంతాన సమస్యలు వస్తాయా…? ఇదిగో క్లారిటీ

|

Jun 24, 2024 | 3:53 PM

బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో కొంతమేర యాంటిబయోటిక్స్ వాడకం ఉన్నప్పటికీ, వాటి వల్ల నేరుగా ప్రజలపై ప్రభావం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. చికెన్‌ను బాగా ఉడికించుకుని తినడం వల్ల సమస్యలు తక్కువగా ఉంటాయని... కానీ, బిర్యానీ రూపంలో తిన్నప్పుడు బరువు పెరిగేందుకు, ఇతర సమస్యలకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు.

Broiler: బ్రాయిలర్ చికెన్ తింటే సంతాన సమస్యలు వస్తాయా...? ఇదిగో క్లారిటీ
Broiler Chicken
Follow us on

సిటీల్లో ఉండే 95 శాతం మంది జనాలు బ్రాయిలర్ చికెనే తింటుంటారు. పల్లెటూర్లలో కూడా ఇప్పుడు అదే సిట్యువేషన్ ఉంది. ఒకప్పుడు అంటే ఇళ్లలోనే నాటుకోళ్లను పెంచుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు అంత ఓపిక, టైం ఎవరికి ఉన్నాయి చెప్పండి. సండే వస్తే.. షాపుకు వెళ్లి.. కేజీ బ్రాయిలర్ చికెన్ తెస్తే పని అయిపోతుంది. నాటు కోళ్లు పెరిగేందుకు 6 నెలలు, సమయం పడుతుంది. కానీ, బ్రాయిలర్ కోళ్లు మాత్రం 35 రోజుల నుంచి 45 రోజుల వ్యవధిలోనే 2 కిలోలకు పైగా బరువు పెరుగుతాయి. బ్రాయిలర్ చికెన్ నేచురల్‌గా ప్రొడ్యూస్ అవ్వదు. క్రాస్ ఫెర్టిలైజింగ్ చేయడం ద్వారా ఈ కోళ్లను ఫారాళ్లో పెంచుతారు. ఈ కోళ్లకు అందించే ఆహారం కారణంగా అతితక్కువ టైంలోనే ఇవి బరువు పెరుగుతాయి. అయితే బ్రాయిలర్ చికెన్ తింటే.. సంతాన సమస్యలు వస్తున్నాయని ఇటీవల వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చే ఫుడ్,  టీకాలు, నీళ్లు, పెంచే వాతావరణం, వైద్యం వంటి విషయంపై పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ వాటిని ఎందరు ఫాలో అవుతున్నారని ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్.

సరైన నిబంధనలు పాటించకుండా పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లను ఉత్పత్తి చేస్తే..  వాటితో కొంతమేర ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కెమికల్స్‌ను, యాంటిబయాటిక్స్‌ ఇచ్చిన కోళ్లను తింటే.. స్త్రీలలో ముందస్తు మెనోపాజ్, పురుషులకైనా వంధ్యత్వం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి అన్నది వాళ్లు చెప్పే మాట. కొన్నిసార్లు వైరస్‌ల నుంచి కోళ్లను కాపాడేందుకు ఎక్కువ మోతాదులో యాంటిబయోటిక్స్‌ను ఇస్తుంటారు. వాటిని తిన్నప్పుడు మహిళలకు, పురుషులకు కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే అన్ని నిబంధనలు పాటిస్తే.. బ్రాయిలర్ కోళ్లను తినడం వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన వాతావరణంలో వాటిని పెంచి.. మంచి నీళ్లు, ఆహారం ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు.

కోళ్లు పెరిగేందుకు గ్రోత్ హార్మోన్లు ఇస్తుంటారని కొందరు అనుకుంటారు. కానీ, అలాంటి చాన్సే లేదని.. ఒకవేళ అలాంటి హార్మోన్ కోళ్లకు ఇవ్వాలంటే 40 రోజుల పాటు రోజుకు నాలుగు ఇవ్వాలి. అంటే ఒక్క కోడికి రూ.20 వరకు ఖర్చు అవుతుంది. ఇది సో.. గ్రోత్ హార్మోన్‌ను కోళ్లకు ఇస్తున్నారన్న విషయం పూర్తిగా అవాస్తమన్నది నిపుణుల వెర్షన్.

(ఈ సమాచారం నిపుణులు నుంచి సేకరించినది. మీరు పూర్తి అవగాహన కోసం న్యూట్రిషనిస్టుల అభిప్రాయం తీసుకోండి)

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…