Sleep: ప్రపంచంలో తక్కువ నిద్రపోయే ప్రజలు.. ఏ దేశస్తులో తెలుసా.?

|

Sep 16, 2024 | 9:42 AM

నిద్రలేమి కారణంగా ప్రస్తుతం ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. మానసిక వ్యాధులు మొదలు, శారీరక వ్యాధుల వరకు ఎన్నో చుట్టు ముడుతున్నాయి. దీంతో వైద్యులు సైతం కచ్చితంగా సరిపడ నిద్ర ఉండాలని చెబుతుంటారు. అయితే మారిన జీవన శైలి, వర్క్‌ కల్చర్‌ కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో...

Sleep: ప్రపంచంలో తక్కువ నిద్రపోయే ప్రజలు.. ఏ దేశస్తులో తెలుసా.?
Sleep
Follow us on

నిద్ర.. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన నిద్ర ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరంలో అన్ని జీవక్రియలు సరిగ్గా సాగాలంటే సరిపడ నిద్ర ఉండాలి. కచ్చితంగా 8 గంటల నాణ్యమైన నిద్ర ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు.

నిద్రలేమి కారణంగా ప్రస్తుతం ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. మానసిక వ్యాధులు మొదలు, శారీరక వ్యాధుల వరకు ఎన్నో చుట్టు ముడుతున్నాయి. దీంతో వైద్యులు సైతం కచ్చితంగా సరిపడ నిద్ర ఉండాలని చెబుతుంటారు. అయితే మారిన జీవన శైలి, వర్క్‌ కల్చర్‌ కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఏ దేశస్తులు అందరి కంటే తక్కువ నిద్రపోతారో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ తక్కువ నిద్రపోయే ఆ దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలో అత్యంత తక్కువ నిద్రపోయే దేశాల్లో సూడాన్‌ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశంలో ప్రజలు సగటున కేవలం 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఇక తక్కువ నిద్రపోయే దేశాల్లో సోమాలియా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రజలు సగటున రోజుకు కేవలం 5.1 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఇక మూడో స్థానంలో యెమెన్ దేశం ఉంది ఇక్కడి ప్రజలు సగటును 5.2 గంటలు నిద్రపోతారు.

ఇక ప్రపచంచంలో తక్కువ నిద్రపోయే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్‌ నాలుగో స్థానంలో ఉంది. ఈ దేశం ప్రజలు సగటున రోజుకు 5.3 గంటలు మాత్రమే నిద్రపోతారు. లిబియా దేశంలో ఈ విషయంలో 5వ స్థానంలో ఉంది. ఈ దేశ ప్రజలు రోజులో కేవలం 5.4 గంటలు మాత్రమే నిద్రపోతున్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇక భారత దేశం విషయానికొస్తే మన దేశంలో ప్రజలు సగటున 7.1 గంటలు నిద్రపోతున్నారు. చైనాలో కూడా సగటు నిద్రించే సమయం ఇదే కావడం విశేషం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..