Tattoo: టాటూలు లైఫ్‌లాంగ్‌ ఎలా ఉంటాయి.. అసలు కారణం ఏంటంటే?

|

Jul 29, 2024 | 11:21 AM

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు టాటూలను ఎంతో ఇష్టపడుతుంటారు. టాటూలకు ఎంత ఆదరణ ఉంటుందంటే ఏకంగా జులై 17వ తేదీని ఏకంగా టాటూడేగా జరుపుకుంటారు. అయితే ఒక్కసారి శరీరంపై టాటూ వేసుకుంటే లైఫ్‌ లాంగ్‌ ఆ టాటూ అలాగే ఉండిపోతుంది. ఎంత చెరిపినా చెరిగిపోదు. ఎంత సబ్బు పెట్టి కడిగినా టాటూ అస్సలు తొలగిపోదు...

Tattoo: టాటూలు లైఫ్‌లాంగ్‌ ఎలా ఉంటాయి.. అసలు కారణం ఏంటంటే?
Tattoo
Follow us on

టాటూలకు ఉండే క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా టాటూలను చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా యువత టాటూలను తెగ ఇష్టపడుతుంటారు. శరీరంపై ఒక్కసారి టాటూ వేసుకుంటే శాశ్వతంగా ఉండిపోతుందనే విషయం తెలిసిందే. అయితే శరీరంపై వేసిన పచ్చబొట్టు లైఫ్‌లాంగ్ తొలగిపోకుండా ఉండడానికి అసలు కారణం ఏంటి.? దీని వెనకాల ఉన్న సైన్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు టాటూలను ఎంతో ఇష్టపడుతుంటారు. టాటూలకు ఎంత ఆదరణ ఉంటుందంటే ఏకంగా జులై 17వ తేదీని ఏకంగా టాటూడేగా జరుపుకుంటారు. అయితే ఒక్కసారి శరీరంపై టాటూ వేసుకుంటే లైఫ్‌ లాంగ్‌ ఆ టాటూ అలాగే ఉండిపోతుంది. ఎంత చెరిపినా చెరిగిపోదు. ఎంత సబ్బు పెట్టి కడిగినా టాటూ అస్సలు తొలగిపోదు. అయితే టాటూ శాశ్వతంగా ఉండడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టాటూ వేసుకునే సమయంలో కలర్‌ను సూదితో చర్మంపై గుచ్చుతారనే విషయం తెలిసిందే. సూదితో రంగు చర్మంలోకి చొచ్చుకుపోతుంది దీంతో చర్మంపై నచ్చిన ఆకారంలో టాటు వస్తుంది. చర్మంలోని అనేక పొరల్లోకి లోతుగా రంగును ఇంజెక్ట్ చేస్తారు. టాటూలు ఏళ్లు గడిచినా మసకబారకపోవడానికి ఇదే కారణం. అయితే పచ్చబొట్టు వేసుకోవడం ఆరోగ్యపరంగా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. టాటూలు వేయించుకున్న వ్యక్తులు ఇతరులతో పోలిస్తే ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నివేదికల్లో తేలాయి,

ఎనలిటికల్ కెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. టాటూ కోసం ఉపయోగించే ఇంక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మం, ఊపిరితిత్తులు, కాలేయం వంటి వాటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. స్కిన్‌ క్యాన్సర్‌ వంటి సమస్యలకు కూడా టాటులు కారణ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఒకసారి వేసుకున్న టాటూను తొలగించడం అసాధ్యమా.? అంటే కచ్చితంగా కాదని సమాధానం చెప్పలేము. ఎందుకంటే టాటూను లేజర్‌ ట్రీట్‌మెంట్ ద్వారా తొలగించుకోవచ్చు. అధిక తీవ్రత లేజర్‌ కాంతిని టాటులపై ప్రొజెక్ట్‌ చేయడం వల్ల టాటును తొలగించవచ్చు. ఈ లేజర్‌ టాటూ ఇంక్ కణాలను తొలగిస్తుంది. డెర్మాబ్రేషన్ అనే విధానం ద్వారా కూడా టాటూలను తొలగించవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..