Viral Photo: మీ ఐ పవర్‌కు టెస్ట్.? ఈ ఫోటోలో పామును గుర్తించగలరా.. ఈజీ పజిల్!

|

Nov 21, 2022 | 12:03 PM

Optical Illusion: ఇక రిలాక్స్ అయ్యేందుకు కొందరు వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్‌పై పడితే.. మరికొందరు ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పడతారు.

Viral Photo: మీ ఐ పవర్‌కు టెస్ట్.? ఈ ఫోటోలో పామును గుర్తించగలరా.. ఈజీ పజిల్!
Snake
Follow us on

పని ఒత్తిడితో సతమతమవుతున్న మనకు.. అప్పుడప్పుడూ రిలాక్సేషన్ కూడా చాలా ముఖ్యం. శరీరంతో పాటు మెదడు రిలాక్స్ అయితేనే.. మనం చురుగ్గా ఉండగలం. ఇక రిలాక్స్ అయ్యేందుకు కొందరు వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్‌పై పడితే.. మరికొందరు ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పడతారు. ఇటీవలకాలంలో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. సాధారణంగా చాలామంది సుడోకోలు, పద సంపత్తిని వీకెండ్ బుక్స్‌లో సాల్వ్ చేస్తుంటారు. కానీ వీటితో పోలిస్తే.. ఫోటో పజిల్ కాస్త డిఫరెంట్. మీ మెదడును మడత పెట్టేస్తది. కన్ఫ్యూజ్ చేసేస్తది. అందుకే నెట్టింట ఇవి తెగ వైరల్ అవుతాయి. ఆ కోవకు చెందిన ఓ పజిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనించారా.? చూసిన వెంటనే అదొక రోడ్డు అని అందరూ చెబుతారు. అయితే ఆ రోడ్డుపై జరజరా పాక్కుంటూ మరోవైపు వెళ్తున్న ఓ పాము కూడా ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. ఇది చాలా సింపుల్ పజిల్.. ఫోటోను పైపైన కాకుండా.. తీక్షణంగా చూస్తే క్షణాల్లో కనిపెట్టయగలరు. మరి లేటు ఎందుకు ఓసారి మీ లక్ పరీక్షించుకోండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూడండి.