వాలెంటైన్ వీక్ ప్రత్యేకమైన పజిల్..! కేవలం 10 సెకన్లలో అందమైన 5 రోజా పువ్వులను కనిపెట్టండి చూద్దాం..!

ఇవాళ్టి మన ఆప్టికల్ ఇల్యూషన్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ వాలెంటైన్ వీక్ కి తగ్గట్టుగా తీసుకొచ్చా మీకోసం. మీరు చూస్తున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో మార్కెట్ ఉంది. ఎంత రద్దీగా ఉందో కదా. ఇంత రద్దీగా ఉన్న మార్కెట్ లో మీరు దాగివున్న 5 అందమైన రోజా పూలను కనిపెట్టాల్సి ఉంటుంది. దీనికి కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం గందరగోళంగా ఉన్న ఈ మార్కెట్ లో 5 రోజా పూలను కనిపెట్టే ప్రయత్నం చేయండి.

వాలెంటైన్ వీక్ ప్రత్యేకమైన పజిల్..! కేవలం 10 సెకన్లలో అందమైన 5 రోజా పువ్వులను కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion

Updated on: Feb 12, 2025 | 7:50 PM

ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ ని మరోసారి బాగా ఫోకస్ చేసి చూడండి. కింద ఉన్న ఫోటోలో వాలెంటైన్ షాపింగ్ కోసం మార్కెట్‌లో చాలా మంది బిజీగా ఉన్నారు. మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది షాపింగ్ చేసే వారిపైన కాదు, చిత్రంలో దాగి ఉన్న రోజా పూల పైన. రెడ్ కలర్ లో ఉన్న అందమైన రోజా పూలు ఎక్కడో దాగి ఉన్నాయి. మీరు 10 సెకన్లలోనే 5 రోజా పూలను కనిపెట్టగలరా..? ప్రయత్నించి చూడండి.

అంతా సరే కానీ ఈ టైమ్ లిమిట్ ఏంటని కోపంగా ఉందా.. ఇలాంటి పజిల్స్ టైమ్ లిమిట్ లేకుండా ఇస్తే ఆసక్తికరంగా ఉండదు కదా..? అందుకే ఈ ఛాలెంజ్ లో మీకు కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. మీరు మంచి దృష్టిని కలిగి ఉంటే 10 సెకన్లు కాదు 5 సెకన్లలోనే కనిపెట్టేస్తారు తెలుసా. మొదట కనిపించకపోతే రెండోసారి ప్రయత్నించండి.

ఈ బ్రెయిన్ టీజర్ ప్రతి ఒక్కరూ సులభంగా పరిష్కరించలేరు. మంచి కంటి చూపు, బాగా గమనించే శక్తి ఉన్నవారు చాలా త్వరగా కనిపెట్టేస్తారు. ఈజీగా 10 సెకన్లలో 5 రోజా పూలను గుర్తించగలరు. మరి మీరు వాళ్లలో ఒకరా..? లేక ఈ ఛాలెంజ్ మీకు కష్టమైందా..? ఒకసారి ప్రయత్నించి చూడండి.

కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా.. రెడీనా మీరు..? ఒకటి… రెండు… మూడు… నాలుగు… ఐదు… ఆరు… ఏడు… ఎనిమిది… తొమ్మిది… పది… మీరు ఇంకా వెతుకుతున్నారా..? ఇంకా కనిపెట్టలేదా.. ? ఇంకొసారి ఫోటోను చాలా శ్రద్ధగా చూడండి. సారీ ఈ పజిల్ కి ఏ హింట్ ఇవ్వలేను ఇవ్వడానికి వీలు కాదు కూడా. ఎందుకంటే అది మొత్తం పజిల్ మజాను చెడగొడుతుంది. మీరు రోజా పూలను గుర్తించలేకుంటే నిరాశ చెందకండి నేను మీకోసం వెతికిపెట్టానుగా.. ఇదిగో ఇక్కడే ఉన్నాయి 5 రోజా పూలు వెంటనే తీసుకెళ్లండి.