‘1000లో నుంచి 100 తీసేస్తే ఎంత ఉంటుంది?’ మీ IQకి అగ్నిపరీక్ష.. లాజిక్ కనిపెట్టగలరా..

Brain Teaser in Telugu: ఈ కింద ఇచ్చిన లాజిక్ ప్రశ్న మీ ఆలోచనా శక్తిని పరీక్షించడానికి ఇచ్చాం. చాలా సులభంగా కనిపించే ఈ ప్రశ్నకు చాలామంది తొందరపడి తప్పు సమాధానం చెబుతారు. మీరు కూడా ఈ బ్రెయిన్ టీజర్‌ను పరిష్కరించి మీ తెలివితేటలకు పదును పెట్టండి. సరైన సమాధానం తెలుసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి – మీకు వచ్చిన సమాధానం నిజంగా కరెక్టేనా?

1000లో నుంచి 100 తీసేస్తే ఎంత ఉంటుంది? మీ IQకి అగ్నిపరీక్ష.. లాజిక్ కనిపెట్టగలరా..
Puzzle Challenge

Updated on: May 31, 2026 | 7:44 PM

ఈ రోజు మీ తెలివితేటలను పరీక్షించే ఒక ఆసక్తికరమైన లాజిక్ ప్రశ్న గురించి తెలుసుకుందాం.. ఇలాంటి లాజిక్ ప్రశ్నలు మన ఆలోచనా శక్తిని పెంచుతాయి. చాలా సార్లు మనం ప్రశ్నను పూర్తిగా చదవకుండా త్వరగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రశ్నను నిశితంగా పరిశీలించి, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే సరైన సమాధానం చెప్పగలుగుతాం. లాజిక్ ప్రశ్నలు పిల్లలు, పెద్దలు అందరూ ఆసక్తికరంగా వాటి సమాధానం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఇవి మెదడుకు వ్యాయామంలా పనిచేస్తాయి. సమస్యలను కొత్త కోణంలో ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే ఏ విషయాన్నైనా తొందరపడి నిర్ణయించకుండా, కాస్త ఆలోచించి సమాధానం చెప్పే అలవాటును పెంపొందిస్తాయి.

ప్రశ్న ఏమిటంటే:

‘1000లో నుంచి 100 తీసేస్తే ఇంకా ఎంత ఉంటుంది?’

ఈ ప్రశ్న వినగానే చాలా మంది వెంటనే మ్యాథమెటిక్స్‌ ప్రకారం లెక్క వేయడం ప్రారంభిస్తారు. సాధారణంగా 1000 నుంచి 100 తీసేస్తే 900 వస్తుందని సమాధానం చెబుతారు. గణితపరంగా అది సరైన సమాధానమే. కానీ ఇది ఒక లాజిక్ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నల్లో కేవలం లెక్కలు కాకుండా ప్రశ్నలోని అర్థాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ “1000లో నుంచి 100 తీసేస్తే” అని అడిగారు. అంటే 1000 అనే సంఖ్యలో ఉన్న “100”ను తీసేయడం అని కూడా భావించవచ్చు.1000 అనే సంఖ్యలో ఒక “100” తీసేస్తే ఇంకా 900 మిగులుతుంది. అందువల్ల ఈ ప్రశ్నకు సరైన సమాధానం కూడా 900 అవుతుంది.అలాగే 1000లో నుంచి మొదటి మూడు అంకెలు అంటే 100..0 తీయగా.. సమాధానం మిగిలిపోయిన సున్నా (0) అని చాలా మంది అనుకుంటారు. ఇది కూడా సరైన సమాధానమే. అయితే ఈ ప్రశ్న ఉద్దేశం గణిత జ్ఞానాన్ని కాకుండా, ప్రశ్నను ఎలా అర్థం చేసుకుంటారో అనేది పరీక్షించడం..!

ప్రశ్న: 1000లో నుంచి 100 తీసేస్తే ఇంకా ఎంత ఉంటుంది?

సమాధానం:

  • 1000లో నుంచి 100 తీసి + వేస్తే (తీసేస్తే) ఎంత ఉంటుంది?
  • -100 తీసి +100 వేస్తే.. =1000 ఉంటుంది.
  • సమాధానం 1000 అన్నమాట.

ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే ముందు దానిని పూర్తిగా అర్థం చేసుకుని ఆలోచించడం చాలా ముఖ్యం. తెలివితేటలు అంటే కేవలం జ్ఞాపకశక్తి కాదు, సరైన విధంగా ఆలోచించే సామర్థ్యం కూడా. లాజిక్ మిస్ కాకూడదు బ్రో..!

Follow Us