Cooked Chicken : నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. ఇలా చేసి తినమంటు సూచనలు చేసిన కేంద్రం

|

Jan 17, 2021 | 5:47 PM

నాన్ వెజ్ ప్రియులను బర్డ్​ ఫ్లూ వణికిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ మహహ్మారి వణికిస్తుండటంతో చికెన్ తినేందుకు భయపడిపోతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది.

Cooked Chicken : నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. ఇలా చేసి తినమంటు సూచనలు చేసిన కేంద్రం
Follow us on

Eating Chicken : నాన్ వెజ్ ప్రియులను బర్డ్​ ఫ్లూ వణికిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ మహహ్మారి వణికిస్తుండటంతో చికెన్ తినేందుకు భయపడిపోతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. బర్డ్​ ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు ఇలా చేయాలని సూచించింది. బాగా ఉడికిన కోడిమాంసం, గుడ్లు తినొచ్చని స్పష్టం చేసింది. ప్రజల్లో అవగాహన పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.

పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం విధించకుండా.. తగిన జాగ్రత్తలతో కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వవచ్చని  రాష్ట్రాలను కేంద్రం మరోమారు కోరింది. బాగా వండిన చికెన్, కోడి గుడ్లతో ఎటువంటి ప్రమాదం లేదని.. జనం అనవసరమైన అపోహలకుపోతే కరోనాతో ఇప్పటికే దెబ్బతిన్న పౌల్ట్రీ, మొక్కజొన్న రైతులు మరింత నష్టపోతారని హెచ్చరించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో ఈ మేరకు అవగాహన పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మహారాష్ట్రలోని తొమ్మిది జిల్లాల్లో పౌల్ట్రీ కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు గుర్తించినట్లు కేంద్రం ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో కోళ్లను పూడ్చిపెట్టే ప్రక్రియను అధికారులు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాకుల్లోనూ.. పావురాలు, ఓ రకమైన గుడ్లగూబలు, కొంగల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు బయటపడినట్లుగా వివరించింది.