Telangana: అందరికీ ఆదర్శం..! స్వయంగా పార, పలుగు పట్టి స్కూలు శుభ్రం చేసిన జిల్లా కలెక్టర్

| Edited By: Balaraju Goud

Aug 08, 2024 | 6:31 PM

హోదాలో  జిల్లా సర్వాధికారి. జిల్లాలోనే టాప్‌ బాస్‌. కొద్దిసేపు వాటన్నింటిని పక్కన బెట్టారు. సామాన్యులుగా మారిన శానిటేషన్ ఉద్యోగిగా అవతారం ఎత్తారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాల పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు.

Telangana: అందరికీ ఆదర్శం..! స్వయంగా పార, పలుగు పట్టి స్కూలు శుభ్రం చేసిన జిల్లా కలెక్టర్
Collector Jithesh Patil
Follow us on

హోదాలో  జిల్లా సర్వాధికారి. జిల్లాలోనే టాప్‌ బాస్‌. కొద్దిసేపు వాటన్నింటిని పక్కన బెట్టారు. సామాన్యులుగా మారిన శానిటేషన్ ఉద్యోగిగా అవతారం ఎత్తారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాల పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. అశ్వాపురంలో జిల్లా కలెక్టర్ శ్రమదానం చేశారు. వర్షపు నీరుతో నిండిన పాఠశాల ఆవరణ శుభ్రం చేశారు. కాల్వ తవ్వకం, పరిశుభ్రత మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. చిన్న చిన్న పనులకు కూడా ఒకరిపై ఆధారపడకుండా మనమే చేసుకోవాలంటూ సూచన చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించారు. అందులో భాగంగా అశ్వాపురంలోని మండల ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన ఆయనకు వర్షపు నీటితో నిండిన పాఠశాల ఆవరణ స్వాగతం పలికింది. దీంతో ఆయన పాఠశాల మొత్తం వర్షపు నీరు నిండి ఉండడం బురదమయంగా మారింది. దీంతో పాఠశాల ఆవరణ ఇలా ఉందేంటంటూ ఉపాధ్యాయులను నిలదీశారు. అంతేకాకుండా చిన్న చిన్న పనులకు కూడా ఒకరిపై ఆధారపడడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. అతి తక్కువ ఖర్చుతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఉండే విధంగా చేయొచ్చంటూ వారికి తెలియజేశారు.

చెప్పడమే కాకుండా తానే స్వయంగా పలుగు, పారా పట్టి రంగంలోకి దిగారు. చిన్న కాలువ తవ్వి వర్షపు నీరు వెళ్లిపోయేలా చేశారు. ఈ పాఠశాల మన అందరిది అని బడిలో గాంధీ బొమ్మ పెట్టగానే సరిపోదు, గాంధీ ఆలోచనలు కూడా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు కలెక్టర్ జితేష్. అక్కడికి వచ్చిన పారిశుద్ధ్య సిబ్బందికి కీలక సూచనలు చేశారు. కలెక్టరే స్వయంగా పలుగు, పారా పట్టి శ్రమదానం చేయడం స్థానికులకు ఆశ్చర్యం కలిగించింది..!

 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..