Vastu Tips: ఇంటికే కాదు, మీ కారుకు కూడా వాస్తు ఉంటుందని తెలుసా.?

|

Aug 05, 2024 | 5:57 PM

భారతీయులు, అందులోనూ హిందువులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఇంటి నిర్మాణం అనే ఆలోచన రాగానే మనలో చాలా మంది చేసే మొదటి పని వాస్తు నిపుణులను సంప్రదించడమే. స్థలం మొదలు ఇంట్లో గోడలకు వేసుకునే రంగుల వరకు అన్నీ వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటాము. అయితే వాస్తు అనేది కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాదని మీకు తెలుసా.?

Vastu Tips: ఇంటికే కాదు, మీ కారుకు కూడా వాస్తు ఉంటుందని తెలుసా.?
Vastu For Cars
Follow us on

భారతీయులు, అందులోనూ హిందువులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఇంటి నిర్మాణం అనే ఆలోచన రాగానే మనలో చాలా మంది చేసే మొదటి పని వాస్తు నిపుణులను సంప్రదించడమే. స్థలం మొదలు ఇంట్లో గోడలకు వేసుకునే రంగుల వరకు అన్నీ వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటాము. అయితే వాస్తు అనేది కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాదని మీకు తెలుసా.? అవును కారు విషయంలో కూడా వాస్తు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కారు పార్కింగ్ చేసే విషయంలో కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కారును ఎట్టి పరిస్థితుల్లో ఉత్తం లేదా తూర్పు దిశలో ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ దిశలో కార్లను పార్క్‌ చేయడం మంచిది కాదని అంటున్నారు. కార్లను దక్షిణం లేదా నైరుతి దిశలో పార్కింగ్ చేయాలని చెబుతున్నారు. అందుకే ఇంట్లో పార్కింగ్ కోసం ఈ స్థలాలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

* ఇక కొందరు ఇంటికి అనుకొని కారు గ్యారేజీని నిర్మించుకుంటారు. అయితే ఇంటికి, కారు పార్కింగ్‌కు మధ్య కచ్చితంగా కొంచమైన గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పాజిటివ్‌ ఎనర్జీ పెరగాలంటే గ్యారేజీకి, ఇంటికి మధ్య ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

* కారు గ్యారేజీకి వేసుకునే రంగు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గ్యారేజీలకు నీలం, పసుపు, తెలుగు రంగులు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్యారేజీలకు డార్క్‌ కలర్స్‌ను వేసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.

* వాస్తు శాస్త్రం ప్రకారం గ్యారేజీ ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తరం దిశగా ఉండాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. గ్యారేజీ నైరుతి దిశలో ఉండాలి. కానీ కారు డోర్లు మాత్రం ఉత్తరం లేదా తూర్పు వైపు తెరుచుకునే ఉండాలి.

* కారును దక్షిణ దిశగా పార్క్‌ చేయకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివ్లల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు.

* అలాగే కారులో ఎప్పుడూ నీటితో కూడిన వాటర్‌ బాటిల్‌ ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ పరార్‌ అవుతుందని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..