Photo Puzzle: ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించగలరా.? అంత ఈజీ అనుకోకండి..

|

Oct 19, 2022 | 11:21 AM

మీకు కూడా ఫోటో పజిల్స్ అంటే ఇష్టమా.? ఎప్పుడూ ఏదొక ఫోటో పజిల్ సాల్వ్ చేస్తుంటారా.?

Photo Puzzle: ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించగలరా.? అంత ఈజీ అనుకోకండి..
Snake Optical Illusion
Follow us on

ఫోటో పజిల్స్.. ఇంటర్నెట్‌లో తరచూ నెటిజన్లను పలకరిస్తుంటాయి. వాటి ప్రత్యేకత చూసే దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది. ఆయా ఫోటోలలో దాగున్న రహస్యం కనుక్కోవడం చాలా కష్టం. ఇవి మన మనస్సును, దృష్టిని మోసగిస్తుంటాయి. మీకు కూడా ఫోటో పజిల్స్ అంటే ఇష్టమా.? ఎప్పుడూ ఏదొక ఫోటో పజిల్ సాల్వ్ చేస్తుంటారా.? అయితే సరికొత్త పజిల్‌ను మీ ముందుకు తీసుకొచ్చేశాం. లేట్ ఎందుకు తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పట్టేద్దాం.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. ఎండిన ఆకులు, గడ్డితో నిండిన ఆ ప్రాంతంలో ఓ పాము దాగుంది. అది ఎంచక్కా ఆకుల కింద దాక్కుని సేద తీరుతోంది. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లయితే.. చిటికెలో కనిపెట్టండి చూద్దాం.

ఫోటోను పైపైన చూసినట్లయితే.. మీకు అది కనిపించదు. తీక్షణంగా చూస్తేనే మీరు కనిపెట్టగలరు. లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి. ఆ పాము ఎక్కడుందో గుర్తించండి. ఎంత వెతికినా మీకు సమాధానం దొరక్కపోతే.. కింద ఫోటోను చూడండి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..