రికార్డులు సృష్టిస్తున్న తోమ్మిదేళ్ళ బుడతడు.. గంటలో 150 పైగా వంటలు.. ఎక్కడో తెలుసా..

|

Feb 22, 2021 | 12:07 PM

ప్రస్తుత హడావిడి జీవితాలలో ఇంట్లో వంటచేసుకొని తినడానికి ఎవరు ఇష్టపడడం లేదు. సమయానికి బయటి ఫుడ్ తినేయడం.. ఇంట్లో వండానికి బద్దకంగా మారిపోతున్నారు. కానీ ఓ మూడో తరగతి బుడతడు

రికార్డులు సృష్టిస్తున్న తోమ్మిదేళ్ళ బుడతడు.. గంటలో 150 పైగా వంటలు.. ఎక్కడో తెలుసా..
Follow us on

ప్రస్తుత హడావిడి జీవితాలలో ఇంట్లో వంటచేసుకొని తినడానికి ఎవరు ఇష్టపడడం లేదు. సమయానికి బయటి ఫుడ్ తినేయడం.. ఇంట్లో వండానికి బద్దకంగా మారిపోతున్నారు. కానీ ఓ మూడో తరగతి బుడతడు మాత్రం విభిన్నంగా గంటలో 150కు పైగా వంటకాలు చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. కేరళకు చెందిన తొమ్మిదేళ్ల హయాన్‌ అబ్దుల్లా 60 నిమిషాల్లో 150 పైగా వంటలు చేసి రికార్డు సృష్టించాడు. అందులో బిరియానీలు, జ్యూస్‌లు, పాన్‌కేక్‌లు, దోశలు, సలాడ్లు, మిల్క్‌ షేక్స్, చాక్లెట్స్‌ వంటి వంటలను కేవలం అరవై నిమిషాల్లోనే వండడం ద్వారా ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ద ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ‘‘హయాన్‌కు నాలుగేళ్లున్నప్పుడే కుకింగ్‌ ఒక అలవాటుగా ఉండేదని, వంటచేయాలన్న ఆసక్తితోనే కిచెన్‌లో నాకు సాయపడేవాడని’’ హయాన్‌ తల్లి రశా అబ్దుల్లా తెలిపారు.

ఇక ఈ విషయమై హయాన్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘‘వంటలు చేయాలన్న నా అభిరుచి గురించి తెలిసినప్పుడు మా ఇంట్లో వాళ్లకు కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే అమ్మనాన్న కేరళలో పుట్టిపెరిగినప్పటకీ చెన్నైలో అనేక రెస్టారెంట్లను నడుపుతున్నారు. అందుకే వారు నా ఆసక్తిని మొదట్లో పట్టించుకోక పోయినప్పటికీ.. తరువాత నేను వేగంగా వంటచేయడాన్ని గమనించి.. స్పీడ్‌గా వంటచేయడంతోపాటు ఇంకేదైనా కొత్తగా ట్రై చేయమని ప్రోత్సహించారు. దీంతో నేను మరింత వేగంగా వంట చేయడం మొదలు పెట్టానన” అంటూ చెప్పాడు. అయితే నేను ఒక్కో వంటకాన్ని వండడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి టైమ్‌ను రికార్డు చేసేవాడిని. అలా చేయడం వల్లే వంటల పోటీలో ఎటువంటి ప్రిపరేషన్‌ లేకపోయినప్పటికీ గెలవగలిగానని చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం హయాన్‌ చెన్నైలోని షేర్‌వుడ్‌ హాల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతనికి సొంతంగా యూ ట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. ‘హయాన్‌ డెలీకసీ’ పేరుతో ఉన్న ఛానల్‌లో అనేక రకాల వంటకాలను ఎలా తయారు చేయాలో ఇంగ్లీష్, మలయాళం, తమిళ భాషల్లో వివరంగా చూపిస్తుంటాడు హయాన్‌. వంటలు మాత్రమే కాకుండా హయాన్‏కు మరో కోరిక కూడా ఉంది. అదేంటంటే భవిష్యత్తులో హయాన్ పైలట్‌ కావాలనుకుంటున్నాడు. అంతేగాక మంచి రెస్టారెంట్స్, పాస్తా బార్‌ను కూడా ఏర్పాటు చేయాలనుందటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు హయాన్.

Also Read:

కస్టమర్లకు రిలయన్స్ జియో బంఫర్ ఆఫర్.. నెలకు కేవలం రూ.100తో అన్‏లిమిటెడ్ కాల్స్.. డేటా.. ఎలాగంటే..