‘హౌదీ ఎకానమీ ‘? మోదీపై రాహుల్, ప్రియాంక ఫైర్ !

howdy economy doin mr. modi..rahul gandhi sister priyanka gandhi target pm, ‘హౌదీ ఎకానమీ ‘? మోదీపై రాహుల్, ప్రియాంక ఫైర్ !

అమెరికాలోని టెక్సాస్ లో ఈ నెల 22 న ‘ హౌదీమోదీ ‘ పేరిట జరగనున్న మెగా ఈవెంట్ లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఇదే అదనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ.. ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ఇండియాను ముంచెత్తుతున్న ఆర్ధిక సంక్షోభాన్ని మరుగున పరచాలంటే ప్రపంచంలోని వ్యవస్థలన్నీ చాలవని వారన్నారు. ఈ ఈవెంట్ ‘ టైటిల్ ‘ పై రాహుల్ సెటైర్ వేస్తూ.. అసలు మన దేశ ఆర్థికవ్యవస్థను పరిగణనలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఇది మంచి ‘ తీరుతో ‘ ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. గత జూన్ నుంచి 45 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అమ్ముకున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఈ దేశ ఆర్థికవ్యవస్థపై వారికి విశ్వాసం సన్నగిల్లినందునే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ట్వీట్ చేశారు. మోదీఫై ఎంతో ఆశతో గత ఆరేళ్లుగా వారు ఇన్ని బిలియన్ డాలర్ల విలువైన షేర్లను స్టాక్ మార్కెట్లో పెట్టారని ఆయన గుర్తు చేశారు.

పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లుతోందని, కానీ ఈ విషయాన్ని అంగీకరించడానికి మోడీ ప్రభుత్వం నిరాకరిస్తోందని ప్రియాంక గాంధీ అన్నారు.’ ప్రతిరోజూ మీడియా వద్ద ‘ 5 ట్రిలియన్, 5 ట్రిలియన్ డాలర్లంటూ ‘ ఊదరగొట్టడం వల్ల దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదు. విదేశాల్లో ఇలాంటి ఈవెంట్లను స్పాన్సర్ చేసినంత మాత్రాన ఇన్వెస్టర్లు ముందుకు రారు ‘ అని ఆమె పేర్కొన్నారు. పైగా ఇందుకు సంబంధించిన వార్తను ఆమె తన ట్వీట్ కు లింక్ చేశారు.

దాదాపు 2013 నుంచి వరుసగా అయిదు త్రైమాసికాల కాలంలో దేశ ఆర్థికవృద్ది రేటు క్రమేపీ క్షీణిస్తూవస్తోందని రాహుల్, ప్రియాంక పేర్కొన్నారు. కార్ల అమ్మకాలు పడిపోతున్నాయని, మూల ధన పెట్టుబడులు మందగిస్తున్నాయని, నిరుద్యోగ సమస్య ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని వారు దుయ్యబట్టారు. బ్యాంకింగ్ వ్యవస్థ పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉందన్నారు. హఠాత్తుగా ఆయిల్ ధరలు పెరిగిపోవడం ‘ మూలిగే నక్కపై తాటిపండు పడిన ‘ చందాన ఉందని రాహుల్, ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *