ఔషధ మొక్కల వన౦

సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో హెర్బల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. ఆయూష్‌ శాఖ కమిషనర్‌ అలుగు వర్షిణి చొరవతో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. జిల్లా ఆస్పత్రి, ఆయూష్‌ విభాగం సంయుక్తంగా హెర్బల్‌ గార్డెన్‌ నిర్వహణను నిత్యం పర్యవేక్షిస్తున్నాయి. మందారం, గోరింట, సబ్జా, వావిలి, వచ, వాము, ఉత్తరాణి, నేరుడు, రణపాల, అర్జున, నల్లేరు, అశోక, కలబంద…ఇలా 50 నుంచి 60 రకాల మొక్కలను ఇక్కడ నాటారు. నిత్యం ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరు పోస్తూ […]

ఔషధ మొక్కల వన౦
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:34 PM

సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో హెర్బల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. ఆయూష్‌ శాఖ కమిషనర్‌ అలుగు వర్షిణి చొరవతో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. జిల్లా ఆస్పత్రి, ఆయూష్‌ విభాగం సంయుక్తంగా హెర్బల్‌ గార్డెన్‌ నిర్వహణను నిత్యం పర్యవేక్షిస్తున్నాయి.

మందారం, గోరింట, సబ్జా, వావిలి, వచ, వాము, ఉత్తరాణి, నేరుడు, రణపాల, అర్జున, నల్లేరు, అశోక, కలబంద…ఇలా 50 నుంచి 60 రకాల మొక్కలను ఇక్కడ నాటారు. నిత్యం ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరు పోస్తూ సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఔషద మొక్కలు నాటడం ద్వారా ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు రోగ నిరోదక శక్తి వృద్ధి చెందుతుందని అధికారులు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఆ మొక్కల నుంచి వచ్చే గాలి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొంటున్నారు.