Hospital: నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు.. వీడియోలో డాక్టర్ల ఆవేదన.!

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్లకు సరైన

Hospital: నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు.. వీడియోలో డాక్టర్ల ఆవేదన.!

Updated on: Sep 25, 2021 | 7:57 AM

Nizamabad Government Hospital: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్లకు సరైన పరికరాలు లేక వైద్యుల ఇబ్బందులు పడుతున్నారు. ఓ పేషంట్ కాలుకు శాస్త్ర చికిత్స చేస్తుండగా మధ్యలో పరికరాలు మొరాయించాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ డాక్టర్లు శాస్ర్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఆస్పత్రి దీనస్థితి ఎంతవరకూ వచ్చిందంటే.. పరికరాలు మొరాయిస్తున్నాయని సదరు డాక్టర్లు వీడియోలో ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సర్జరీ మధ్యలో ఇలా అయితే పేషంట్ల ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్యులు. నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో ఎక్కువ సంఖ్యలో ఆర్థో సర్జరీలు జరుగుతున్నా.. మంచి పరికరాలు కాని, అత్యవసర పరికరాలు కాని లేకుండా శాస్త్ర చికిత్సలు చేయాల్సిన దుస్థితి ఆస్పత్రిలో నెలకొందని వైద్యులు, రోగులు విలపిస్తున్నారు.

Read also: Janasena: జనసేన నాయకుడి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. అసలేం జరిగిందంటే..!

Follow Us