World Liver Day 2024: లివర్‌కు మేలు చేసే కాఫీ.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే?

|

Apr 19, 2024 | 1:43 PM

శరీరంలో ఇతర భాగాల మాదిరి కాలేయం కూడా చాలా విలువైనది. ఇది మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి. నిజానికి, కాలేయం మన శరీరంలో అనేక ముఖ్య విధులు నిర్వహిస్తుంది. అంటే ఇది మన శరీరంలో ఒకటి కంటే ఎక్కువ విధులను నిర్వహిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆహారం, జీవనశైలికి..

World Liver Day 2024: లివర్‌కు మేలు చేసే కాఫీ.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే?
Coffee for Liver
Follow us on

శరీరంలో ఇతర భాగాల మాదిరి కాలేయం కూడా చాలా విలువైనది. ఇది మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి. నిజానికి, కాలేయం మన శరీరంలో అనేక ముఖ్య విధులు నిర్వహిస్తుంది. అంటే ఇది మన శరీరంలో ఒకటి కంటే ఎక్కువ విధులను నిర్వహిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆహారం, జీవనశైలికి సంబంధించిన సమస్యల కారణంగా నేటి కాలంలో అనేక మంది కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం..

కొవ్వు కాలేయం అంటే ఏమిటి?
గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్‌లోని ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజీ, హెపటాలజీ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (వయోజన) డాక్టర్ సుక్రిత్ సింగ్ సేథీ మాట్లాడుతూ.. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది. కొవ్వు కాలేయంలో రెండు రకాలు.. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్.

ఫ్యాటీ లివర్ లక్షణాలు

  • కడుపు కుడి వైపున నొప్పి
  • కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం
  • చర్మం దురద
  • కడుపు వాపు, నొప్పి
  • చీలమండలు, పాదాలలో వాపు
  • లేత రంగు మూత్రం
  • నిరంతర అలసట
  • వాంతులు, విరేచనాలు
  • ఆకలి లేకపోవడం

ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఎలా బయటపడాలి?

కాలేయ సంబంధిత వ్యాధుల వైద్యుడు శివ్ కుమార్ సారిన్ మాట్లాడుతూ.. టీ ఫ్యాటీ లివర్‌కు హాని కలిగిస్తుంది. అయితే కాఫీ కాలేయం నుంచి కొవ్వును తొలగిస్తుందని చెబుతున్నారు. అమెరికా నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన ప్రకారం.. కాఫీ తాగడం వల్ల లివర్‌కు మేలు చేస్తుంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యతో బాదపడుతున్నవారికి కాఫీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. రోజూ కాఫీని సమతుల్య పరిమాణంలో తాగితే కాలేయానికి సంబంధించిన అనేక రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇది మీ కాలేయం నుంచి కొవ్వును సులువుగా తొలగిస్తుంది. నిజానికి క్లోరోజెనిక్ యాసిడ్ కాఫీలో అధికంగా ఉంటుంది. ఇది వాపు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, కాఫీలో పాలీఫెనాల్స్, కెఫిన్, మిథైల్క్సాంథైన్ కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, నైట్రోజన్ సమ్మేళనాలు, నికోటినిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం వంటి అంశాలు అధికంగా ఉంటాయి.

ఎన్ని కప్పుల కాఫీ తాగాలి?

కాఫీలో కెఫిన్ కూడా ఉంటుంది. ఇది అలసట, బద్ధకాన్ని తొలగించడమే కాకుండా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణజాలాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. సమతుల్య పరిమాణంలో కాఫీ తాగడం కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల కాఫీ తాగితే ప్రయోజనకరంగా ఉంటుందని, అంతకంటే ఎక్కువ తాగితే మొదటికే మోసం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.