Women Health: మహిళలకు ముఖ్య గమనిక.. పీరియడ్స్ సమయంలో వీటికి దూరంగా ఉండండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..

|

Nov 05, 2022 | 7:04 AM

సాధారణంగానే పీరియడ్స్ సమయంలో మహిళలు నరకం అనుభవిస్తారు. కడుపు నొప్పి, తీవ్ర రక్తస్రావం, తల తిరగడం, తలనొప్పి, వికారం వంటి సమస్యలతో

Women Health: మహిళలకు ముఖ్య గమనిక.. పీరియడ్స్ సమయంలో వీటికి దూరంగా ఉండండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..
Women Health
Follow us on

సాధారణంగానే పీరియడ్స్ సమయంలో మహిళలు నరకం అనుభవిస్తారు. కడుపు నొప్పి, తీవ్ర రక్తస్రావం, తల తిరగడం, తలనొప్పి, వికారం వంటి సమస్యలతో సతమతం అవుతారు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే, పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే ఆ సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఎక్కువ జిడ్డు, కారంగా ఉండే ఆహారాలను తినడం వల్ల గ్యాస్, పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం ఏర్పడవచ్చు. అయితే, కొన్నిసార్లు ఉబ్బరం పీరియడ్స్ వల్ల కూడా రావచ్చు. దీనిని పీరియడ్ బ్లోటింగ్ అంటారు. పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం సమస్య వల్ల పొత్తికడుపు కండరాలలో ఎక్కువ నొప్పి అనిపిస్తుంటుంది. తినే ఆహారంపై ఉబ్బరం సమస్య ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో వాపు ఉంటుంది. దీని వల్ల గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది. అయితే, ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. తినే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఉబ్బరాన్ని ఎలా నిర్వహించాలి..

చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో తీవ్రంగా ఇబ్బందిపడుతుంటారు. అయితే, ఈ ఇబ్బందికి వారు తినే ఆహారం కూడా ఒక కారణం అవుతుందంటున్నారు. పీరియడ్స్ రావడానికి వారం ముందు డైట్ ను కస్టమైజ్ చేసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు. అయితే, ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది పడితే అది తినడం వల్ల గ్యాస్ సమస్య, కడుపులో నొప్పి పెరుగుతుంది. కింద పేర్కొన్న ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం పొందవచ్చు.

తీపి పదార్థాలు, స్నాక్స్..

స్నాక్స్ ఉబ్బరం, గ్యాస్ సమస్యలను ప్రోత్సహిస్తాయి. పీరియడ్స్ సమయంలో స్వీట్ల తినాలపిస్తుంటుంది. అయితే, స్వీట్ స్నాక్ అస్సలు తీసుకోవద్దు. దీనికి బదులుగా పండ్ల రసాన్ని తీసుకోవచ్చు.

స్పైసీ ఫుడ్..

పీరియడ్స్ సమయంలో అధిక అలసట, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉన్న మహిళలు స్పైసీ ఫుడ్ తినకుండా ఉండాలి. మసాలా ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడుతుంది.

ఆల్కహాల్..

ఆల్కహాల్ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పీరియడ్స్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. నరాల వాపు, తలనొప్పి సమస్యను పెంచుతుంది.

హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..