Vitamins: విటమిన్స్‌ లోపంతో ట్యాబ్లెట్లు వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

|

Apr 14, 2022 | 6:00 AM

చాలా రకాల విటమిన్స్‌(Vitamins)ను మనం సహజ సిద్ఘంగా లభించే ఆహారపదార్ధాల్నించి కాకుండా విటమిన్ ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటుంటాం...

Vitamins: విటమిన్స్‌ లోపంతో ట్యాబ్లెట్లు వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!
Vitamins Tablets
Follow us on

చాలా రకాల విటమిన్స్‌(Vitamins)ను మనం సహజ సిద్ఘంగా లభించే ఆహారపదార్ధాల్నించి కాకుండా విటమిన్ ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటుంటాం. ఇది ఏ మాత్రం మంచిది కాదు. డబ్బులు దండగవడమే కాకుండా, లేని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గూగుల్(Google), నెట్ అందుబాటులో వచ్చాక అవగాహన ఎక్కువై లేనిపోని తలనొప్పి తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యపరంగా(Health) ఏదైనా అసౌకర్యం కలిగితే చాలు.. వెంటనే నెట్‌లో సెర్చ్ చేసి కావల్సిన విటమిన్లు కొనడం, తీసుకోవడం చకచకా జరిగిపోతున్నాయి. ఆరోగ్యం పేరుతో డయిటరీ విటమిన్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. అమెరికాలో అయితే ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. ఏటా 35 బిలియన్లు కేవలం డయిటరీ సప్లిమెంట్స్ విటమిన్స్ కోసం ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే అవి నిజంగానే ఆరోగ్యకరమైన ప్రయోజనాల్ని అందిస్తున్నాయా అంటే అనుమానమే అంటున్నారు వైద్య నిపుణులు. శరీరానికి కావల్సిన విటమిన్లను ఆరోగ్యకరమైన డైట్ మాత్రమే అందిస్తుందని అంటున్నారు.

విటమిన్ ఎ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు వైద్యులు. విటమిన్ ఎ అనేది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. అయితే ఇది మోతాదుకు మించితే విషంగా మారే ప్రమాదముంది. మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్‌కు దారీ తీయవచ్చు. గుడ్లు, పాలు, ఛీజ్ వంటి పదార్ధాల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. అదనంగా ట్యాబ్లెట్స్ తీసుకోవల్సిన అవసరం లేదు. విటమిన్ బి 2 లేదా రిబోఫ్లేవిన్.. శరీరానికి కావల్సిన 8 రకాల బి విటమిన్లలో ఇది చాలా ముఖ్యమైనది. శరీరంలోని ఆహారాన్ని అంటే కార్బోహైడ్రేట్స్‌ను ఫ్యూయల్ అంటే గ్లోకోజ్‌గా మార్చి..శక్తిని అందిస్తుంది. మనం రోజూ తినే వివిధ రకాల అల్పాహారంలో ఇది సమృద్ధిగా ఉంటుంది. అదనంగా విటమిన్ ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవల్సిన అవసరం లేదు. ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనం ఏ మాత్రం లేదు.

విటమిన్ బి 6 మరో బి కాంప్లెక్స్ విటమిన్ ఇది. ఇది సాధారణంగా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పౌల్ట్రీ, చేపల్లో సమృద్ధిగా లభిస్తుంది. దీర్ఘకాలం పాటు విటమిన్ బి 6 ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి కోసం చాలా మంది ఏ మాత్రం అవగాహన లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. ఎండలో అలా బయటికి వెళ్లి తిరిగితే కావల్సినంత విటమిన్ డి లభిస్తుంది. అలా చేయకుండా ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటూ డబ్బులు వృధా చేస్తుంటాం. విటమిన్ డి అనేది బాడీ కాల్షియంను గ్రహించేందుకు తోడ్పడుతుంది. తద్వారా ఎముకలు బలోపేతమవుతాయి. కండరాలు, నరాల బలానికి దోహదపడుతుంది. విటమిన్ డి కావాలంటే సూర్యరశ్మి ద్వారా పొందడమే ఉత్తమమంటున్నారు.

గమనిక:- ఈ సమాచారం కేవలం నిపుణుల సూచనలు, ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు ధృవికరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యుల సలహాలు తీసుకోండి.

Read Also..  Curd Benefits: వేసవిలో ఇదే అమృతం.. పెరుగుతో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.. ఇంకెన్నో ప్రయోజనాలు..