Weight Loss Tips: ఇలాంటి పద్దతులు పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు తెలుసా..? అవేంటంటే..

|

Jul 11, 2021 | 1:53 PM

Weight Loss Tips - Diet: ఉరుకులు పరుగుల జీవితంలో.. అధిక బరువు సమస్య చాలా మందిని తీవ్రంగా వేధిస్తోంది. సరిగా ఆహారం తినకపోవడం, తీవ్ర ఒత్తిడి,

Weight Loss Tips: ఇలాంటి పద్దతులు పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు తెలుసా..? అవేంటంటే..
Weight Loss Tips
Follow us on

Weight Loss Tips – Diet: ఉరుకులు పరుగుల జీవితంలో.. అధిక బరువు సమస్య చాలా మందిని తీవ్రంగా వేధిస్తోంది. సరిగా ఆహారం తినకపోవడం, తీవ్ర ఒత్తిడి, నిద్రలేకపోవడం వల్ల చాలా మంది ఒబేసిటీ బారిన పడుతున్నారు. దీనివల్ల మరికొన్ని రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే.. అధిక బరువును తగ్గించకునేందుకు చాలామంది జిమ్‌లల్లో చమటోడుస్తుంటారు. దీంతోపాటు కఠిన ఆహార నియమాలను పాటిస్తుంటారు. అయితే.. ఎలాంటి ఆహారం తింటే.. బరువును సులువుగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలసుకుందాం..

ఇలాంటివి తింటే మేలు..
సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలు, అవకాడొ, దోసకాయ, బ్రొకోలి, ఆలివ్‌ ఆయిల్‌, గ్రీన్‌ యోగర్ట్‌, దంపుడు బియ్యం, మొలకలు, ఓట్స్‌, తృణ ధాన్యాలు, యాపిల్స్‌, అరటిపళ్లు, బ్లూ బెర్రీ వంటి యాంటాక్సిడెంట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వీటితోపాటు నీరు ఎక్కువగా తాగాలి. రోజూ నాలుగు లీటర్లకు పైగా తాగాలి.

ఈ పద్దతులు పాటించండి..
➼ రోజూ సమతులాహారం తీసుకోవాలి. ఎక్కువగా తినకూడదు. పీచుపదార్థాలు బాగా ఉండేలా చూసుకోవాలి. వేపుడు పదార్థాలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. షుగర్‌ డ్రింక్స్‌ తీసుకోవద్దు.
➼ ప్రొటీన్లు బాగా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్డు, ఫ్రూట్స్, సలాడ్ లాంటివి తీసుకోవాలి. దీంతోపాటు బ్లాక్‌ కాఫీ తాగితే మంచిది.
➼ ఉదయం, సాయంత్రం వ్యాయామాలు చేయాలి. యోగా, నడవడం లాంటివి చేయాలి.
➼ కార్డియో వ్యాయామాలు చేస్తే ఎంతో తొందరగా బరువు తగ్గొచ్చు. అంటే రన్నింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్, స్విమ్మింగ్‌, జుంబా, బ్రిస్క్‌వాక్‌, మెట్లు ఎక్కడం లాంటివి చేయాలి. సైక్లింగ్‌
➼ రెసిస్టెన్స్‌ వ్యాయామాలు కూడా బరువును తగ్గిస్తాయి.
➼ కాఫీ లేదా గ్రీన్‌ టీ తాగాలి. వాటిలో ఉండే కెఫైన్‌ వల్ల బరువు తగ్గవచ్చు.
➼ అప్పుడప్పుడు ఫాస్టింగ్‌ ఉండటం వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు.
➼ ఇలా చేయడం వల్ల తక్కువ క్యాలరీలు శరీరానికి అంది బరువు తగ్గించే హార్మోన్లు క్రమబద్ధీకరణ చెందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Electrocution: రెప్పపాటులో విషాదం.. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం..

Sirisha Bandla: నేడే రోదసిలోకి తెలుగమ్మాయి శిరీష.. 90 నిమిషాల ప్రయాణం.. ఇంట్రస్టింగ్ విషయాలు