Health Tips : చిన్న చిన్న సమస్యలకు సంప్రదాయ చిట్కాలు..

| Edited By: Rajitha Chanti

Jul 21, 2024 | 3:30 PM

దీనికోసం తరాలుగా వస్తున్న కొన్ని సంప్రదాయ చిట్కాలను పాటిస్తే మంచిదని కొందరి అభిప్రాయం. చిన్న చిన్న సమస్యలకు చెక్ పెట్టడానికి సంప్రదాయ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. దీని ద్వారా మెడిసిన్ వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ఆ సంప్రదాయ చిట్కాలు ఏంటి ? ఆ సమస్యలేంటి ఓసారి చూద్దాం.

Health Tips : చిన్న చిన్న సమస్యలకు సంప్రదాయ చిట్కాలు..
Traditional Tips
Follow us on

మారిన జీవన శైలితో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నాం. సమస్య ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిదే కానీ… ప్రతి చిన్న విషయానికి మెడిసిన్ తీసుకోవడం అంత మంచిది కాదనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. దీనికోసం తరాలుగా వస్తున్న కొన్ని సంప్రదాయ చిట్కాలను పాటిస్తే మంచిదని కొందరి అభిప్రాయం. చిన్న చిన్న సమస్యలకు చెక్ పెట్టడానికి సంప్రదాయ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. దీని ద్వారా మెడిసిన్ వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ఆ సంప్రదాయ చిట్కాలు ఏంటి ? ఆ సమస్యలేంటి ఓసారి చూద్దాం.

మన నోటినీ ఎంత క్లీన్ చేసుకున్నప్పటికీ నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎన్ని రకాల పేస్టులు, క్రీములు, మెడిసిన్లు వాడిన సమస్య మాత్రం అలానే ఉంటుంది. దీనికోసం ప్రతిరోజు నాలుగు లేదా ఐదు పుదీనా ఆకులను తినడం వల్ల ఈ ఇబ్బంది నుండి బయట పడొచ్చు. అలాగే పడిశం అంత తొందరగా పోదు కాబట్టి… ఇలాంటప్పుడు మిరియాల చారు సూపర్ గా పని చేస్తుంది. లేదా పాలలో మిరియాల పొడి వేసుకొని తాగిన బెటర్. దీంతోపాటు మనం తినే ఆహారంలో మిరియాల పొడి తీసుకోవడం అలవాటు చేసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్య కూడ పోతుంది.

బిపి కంట్రోల్ లో ఉండాలంటే మునగాకు పొడి తరచూ తీసుకోవడం చాలా మంచిదని రిఫర్ చేస్తున్నారు. ప్రతిరోజు చిటికెడు మునగాకు పొడి తీసుకుంటే బిపి ద్విషుగ్గా కంట్రోల్ లో ఉంటుందట. రక్తహీనత సమస్యకు తేనే చక్కటి పరిష్కారం. రెగ్యులర్గా వాడే చక్కర వినియోగాన్ని తగ్గించి… టీ కాఫీ ఇతర ఆహార పదార్థాల్లో తేనెను ఉపయోగిస్తే రక్తహీనత నుంచి బయటపడచ్చని సలహా. ఇక రక్తనాళాలు మందంగా ఉండి సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు బీట్రూట్ రసాన్ని రోజు తాగితే చాలా మంచిది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండె సమస్యలు కూడా అంత త్వరగా రావు.