Health Tips: స్వైన్ ఫ్లూ నివారణకు అద్భుతమైన హోమ్ రెమెడీస్.. పూర్తి వివరాలివే..

|

Jul 28, 2022 | 6:40 AM

Health Tips: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని

Health Tips: స్వైన్ ఫ్లూ నివారణకు అద్భుతమైన హోమ్ రెమెడీస్.. పూర్తి వివరాలివే..
Cold
Follow us on

Health Tips: దేశ వ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ వ్యాధి ప్రధానంగా H1N1 వైరస్ జాతి వల్ల వస్తుంది. స్వైన్ ఫ్లూ.. టైప్ A ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల పందుల్లో వచ్చే శ్వాసకోశ వ్యాధి. కొన్ని సందర్భాల్లో, ఈ స్వైన్ ఫ్లూ వైరస్.. మనుషులకు కూడా సోకుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. స్వైన్ ఫ్లూ వ్యాధికి ఇంటి నివారణలు చెక్ పెడతాయి.

జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, బాడీ పెయిన్స్, తలనొప్పి, చలి, అలసట వాంతులు, విరేచనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని మూడు దోషాల ప్రధానమైన ఆయుర్వేద సన్నిపాత జ్వరాలలో ఒకదానితో పోల్చారు ఆయుర్వేద వైద్యులు.

నియంత్రణ చర్యలు..
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతులతో ముక్కు, నోటిని కప్పి ఉంచడం ద్వారా స్వైన్ ఫ్లూని నివారించవచ్చు.
రద్దీగా ఉండే ప్రదేశాల్లో, పాడైపోయిన ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు.
సహోద్యోగులను, ఇతరులను రక్షించడానికి ముందు జాగ్రత్తగా దూరం పాటించాలి.

ఇంటి నివారణా చర్యలు..
1. ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. వేప ఆకులు, కమ్మిఫోరా, ధూపం వేయాలి.
2. షడంగ పానియా, జీలకర్ర, కొత్తిమీర గింజలతో తయారు చేసిన వేడినీటిని తాగాలి.
3. స్వైన్ ఫ్లూ నుండి త్వరగా కోలుకోవడానికి తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి.
4. ఆయుర్వేదం ప్రకారం ముక్కు, గొంతు శుభ్రపరుచుకోవాలి.
5. తులసి రసాలను తీసుకోవాలి.
6. శరీరానికి శక్తి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి.. చ్యావన్‌ప్రాశ్, ఇందుకాంత ఘృత, బ్రహ్మరసాయనం, అశ్వగంధవలేహ్యం, కూష్మాండ రసాయనం తీసుకోవడం మంచిది.
7. ప్రాణాయామం, యోగా చేయాలి. అనులోమ్ విలోమ్, భస్త్రికా, కపాల్‌భతి వంటి కొన్ని ప్రభావవంతమైన ప్రాణాయామాలు చేయాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..