Health: ముఖం రంగు మారిందా.. బాబోయ్.. అస్సలు లేట్ చేయొద్దు..

|

Aug 09, 2024 | 4:18 PM

గతంలో 60 ఏళ్ల పైబడినవారిలో గుండెపోట్ల గురించి వినేవాళ్లం. కానీ ఈ మధ్యకాలంలో యువత కూడా గుండెపోట్ల బారినపడుతున్నారు. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా లైఫ్ స్టైల్ ప్రొపర్‌గా లేకపోవడం ప్రధాన సమస్య అని డాక్టర్లు చెబుతున్నారు. ఇక గుండెపోటు సంకేతాలు రకరకాలుగా ఉంటాయి.

Health: ముఖం రంగు మారిందా.. బాబోయ్.. అస్సలు లేట్ చేయొద్దు..
Heart Attack
Follow us on

కొందరు వ్యక్తులు ఛాతీ నొప్పిని గ్యాస్ సంబంధిత సమస్యగా  భావించి లైట్ తీసుకుంటారు. కానీ ఇది కొన్నిసార్లు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది. సరైన చికిత్సతో గుండెపోటు బాధితులను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ గుండెపోటు రాకముందే కొందరిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వైద్యుల సలహా ప్రకారం గుండెపోటు రావడానికి రెండు రోజుల ముందు శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అది ఏమిటో తెలుసుకుందాం పదండి

ముఖం వాపు:

కారణం లేకుండా ముఖం ఉబ్బితే జాగ్రత్త ఇది గుండెపోటుకు హెచ్చరిక సంకేతం. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, శరీరంలో ద్రవం పేరుకుపోతుంది, దీని వలన ముఖం వాపు వస్తుంది. 

కళ్ళ చుట్టూ రంగులో మార్పు:

కళ్ల కింద, కనురెప్పల దగ్గర కొవ్వు నిల్వలు గుండె జబ్బులకు సంకేతం. అలానే లేత పసుపు రంగు పదార్థం కళ్ల చుట్టూ చేరడం ప్రారంభమవుతుంది. దీనిని శాంథెలాస్మా అని కూడా అంటారు. ఇది గుండె, మెదడు, ఇతర అవయవాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

ముఖం ఎడమ వైపు నొప్పి:

ముఖం ఎడమ వైపున నొప్పి లేదా తిమ్మిరి గుండెపోటుకు మరో హెచ్చరిక. మీకు మీ ముఖం ఎడమ వైపున నిరంతర నొప్పి, తిమ్మిరి ఉంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ముఖం రంగులో మార్పు:

ముఖం రంగు అకస్మాత్తుగా నీలం లేదా పసుపు రంగులోకి మారినట్లయితే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా పని చేయకపోతే, తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం శరీరంలోని కొన్ని భాగాలకు చేరదు. ఇది చర్మం రంగును ప్రభావితం చేస్తుంది. మీకు అలా అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..