Dry Eyes: మీ కళ్లు తరచూ పొడిబారుతున్నాయా.? ఈ సింపుల్ టిప్స్‌తో రిలాక్స్ అవ్వొచ్చు..

| Edited By: Ravi Kiran

Apr 16, 2024 | 1:00 PM

కళ్లలో నీరు సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు, కళ్లలో వాటర్ లేనప్పుడు మన కళ్లు డ్రై అయిపోతాయి. దీంతో కళ్లల్లో మంట, ఎర్రపడటం, ఏదైనా వెలుతురుని డైరెక్టుగా చూడలేకపోవడంతో పాటు కళ్ళు ఉబ్బి ఉండడం లాంటివి మనం రెగ్యులర్‌గా గమనిస్తూ ఉంటాం. దీని కారణంగా మన రోజువారి పనులు చేయడానికి..

Dry Eyes: మీ కళ్లు తరచూ పొడిబారుతున్నాయా.? ఈ సింపుల్ టిప్స్‌తో రిలాక్స్ అవ్వొచ్చు..
Dry Eyes
Follow us on

కళ్లలో నీరు సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు, కళ్లలో వాటర్ లేనప్పుడు మన కళ్లు డ్రై అయిపోతాయి. దీంతో కళ్లల్లో మంట, ఎర్రపడటం, ఏదైనా వెలుతురుని డైరెక్టుగా చూడలేకపోవడంతో పాటు కళ్ళు ఉబ్బి ఉండడం లాంటివి మనం రెగ్యులర్‌గా గమనిస్తూ ఉంటాం. దీని కారణంగా మన రోజువారి పనులు చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇలా కళ్లు తరచూ పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, ఎక్కువ స్క్రీన్‌ టైం స్పెండ్ చేయడం, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు. కారణం ఏదైనా మన కళ్లు డ్రై అవ్వకుండా కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

మన కళ్లు డ్రై అవ్వకుండా ఉండడానికి కంటి చూపును మెరుగుపరిచే ఫుడ్స్ తీసుకోవడం ముఖ్యం అని అంటున్నారు నిపుణులు. శరీర ఆరోగ్యానికి తగినన్ని వాటర్ తాగకపోవడం ప్రధాన సమస్య. బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉండటంతో పాటు, డ్రై ఐస్ కాకుండా ఉండడానికి వాటర్ ఎంతో ముఖ్యమని సలహా ఇస్తున్నారు. ప్రతిరోజు తగిన మోతాదులో వాటర్ తాగుతూ ఉంటే కన్నీళ్ల ఉత్పత్తికి సహకరిస్తుంది. అలా కళ్లు పొడిబారడాన్ని నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.

దీంతోపాటు ఎక్కువ సేపు డిజిటల్ స్క్రీన్‌కి అతుక్కపోవడంతో రెప్పలు వాల్చడం తగ్గిపోతుంది. ఈ కారణంగా కూడా కళ్లు పొడిబారతాయని అంటున్నారు. ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్స్‌లతో టైం స్పెండ్ చేసేవారు స్క్రీన్ చూస్తున్నంత సేపు తప్పకుండా రెప్పలు కొడుతూ ఉండాలని అంటున్నారు. కళ్ల మీద ఒత్తిడి తగ్గడానికి పొడిబారక్కుండా ఉండడానికి ఈ స్క్రీన్లతో కొంత డిస్టెన్స్ మైంటైన్ చేయాలని సూచిస్తున్నారు. దీనికోసం ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 30 సెకన్ల బ్రేక్ తీసుకోవాలని.. ఆ బ్రేక్ సమయంలో మనకి దగ్గరలో ఉన్న ఏదైనా వస్తువు పైన ఫోకస్ చేసి చూడాలని అంటున్నారు.

మన కళ్ల కోసం కొంత జాగ్రత్త తీసుకోవాలని బయటకి వెళ్తున్న సమయంలో గాలి, దుమ్ము, ఎండ నుంచి మన కంటిని కాపాడుకోవడానికి సన్ గ్లాసెస్ లేదా స్పెట్స్ లాంటివి వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు. వీటన్నింటితో పాటు మంచి ఆహారం తీసుకోవాలని అంటున్నారు. అవిసె గింజలు, వాల్నట్స్, విటమిన్ ఏ, సీ, ఈ ఉన్న ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య తగ్గకపోతే వైద్యుడ్ని సంప్రదించడం బెటరని అంటున్నారు.