Health: యూరిన్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టే 5 సూపర్ సింపుల్ చిట్కాలు!

|

Aug 15, 2024 | 1:18 PM

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య.. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ప్రాణాంతకం కానప్పటికీ, చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య ఉంటే మూత్రవిసర్జన సమయంలో చికాకు, తరచుగా మూత్రవిసర్జన చేయాలనే కోరిక, కడుపు నొప్పి వంటి ఇబ్బందులు ఉంటాయి.

Health: యూరిన్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టే 5 సూపర్ సింపుల్ చిట్కాలు!
Urinary Tract Infection
Follow us on

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య వల్ల మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగని పురుషల్లో ఈ సమస్య ఉండదని కాదు. యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మంట అనిపించడం, తరచుగా యూరిన్ వెళ్లాలి అనిపించడం, యూరిన్ అర్జెంటుగా రావడం ఇవన్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సంకేతాలు అని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ పీఎస్ వలీ తెలిపారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఏయే సలహాలు పాటించడం వల్ల ఇది త్వరగా తగ్గుతుందో ఆయన వివరించారు.

  •  పానీయాలు విపరీతంగా తీసుకోవడం: రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు త్రాగడం ముఖ్యం. ఇంత నీరు త్రాగడం వల్ల బ్లాడర్ లో ఉన్న బాక్టీరియా సులభంగా బయటకు పోతుంది.
  •  క్రాన్ బెర్రీ జ్యూస్ త్రాగడం: క్రాన్ బెర్రీ జ్యూస్ బ్లాడర్ లో ఉన్న బాక్టీరియా ప్రాబల్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
  •  విటమిన్-C ఎక్కువగా ఉండే ఆహారం తినడం: విటమిన్ C యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రతను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
  • పెరుగు ఎక్కువగా తినడం: పెరుగులో ప్రోబైయాటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గడం జరుగుతుంది.
  • దాల్చిన చెక్క వినియోగం: దాల్చిన చెక్క లోని గుణాలు బాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రికవరీ వేగవంతం చేస్తాయి.
  •  వైద్య సలహా: ఈ చిట్కాలతో పాటు, డాక్టర్ సూచించిన యాంటీబయోటిక్స్ కూడా వాడండి. వైద్యుని సలహాతో పాటు ఈ చిట్కాలను పాటిస్తే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది)