Health: వాసన, రుచిని గుర్తించే శక్తిని కోల్పోయారా.? అయితే మీలో ఆ విటమిన్‌ లోపం ఉన్నట్లే..

|

Aug 14, 2022 | 9:12 PM

Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్‌లు సమృద్ధిగా అందాలనే విషయం తెలిసిందే. శరీరంలో అన్ని క్రియలు సవ్యంగా సాగాలంటే విటమిన్లు అందాలి. విటమిన్‌ల లోపం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

Health: వాసన, రుచిని గుర్తించే శక్తిని కోల్పోయారా.? అయితే మీలో ఆ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
Follow us on

Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్‌లు సమృద్ధిగా అందాలనే విషయం తెలిసిందే. శరీరంలో అన్ని క్రియలు సవ్యంగా సాగాలంటే విటమిన్లు అందాలి. విటమిన్‌ల లోపం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న విటమిన్‌ లోపాల్లో డీ ప్రధానమైందని చెప్పాలి. మారుతోన్న జీవన విధానం, ఇళ్ల నిర్మాణ శైలి కారణంగా సరిపడా సూర్యరక్ష్మి లభించడం లేదు.

దీంతో విటమిన్‌ డీ లోపం బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. శరీరానికి సరిపడ విటమిన్‌ డీ లభించకపోతే గుండె సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఎముకలు గుల్లబారిపోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయనే విషయం తెలిసిందే. అయితే తాజా పరిశోధనల్లో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. విటమిన్‌ డీ లోపించిన వారు భవిష్యత్‌లో రుచి, వాసనను గుర్తించే శక్తిని కోల్పోయే అవకాశం 39 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.

తగినంత విటమిన్‌ డీ లభించే వారితో పోల్చితే అందని వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్ లభించాలంటే రోజులో కనీసం 10 నుంచి 20 నిమిషాల పాటు శరీరంపై సూర్య కిరణాలు పడేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక విటమిన్‌ డీ కేవలం సూర్యరక్ష్మితోనే కాకుండా పాలకూర, కాలే, ఓక్రా, సోయా బీన్స్‌, బైట్‌ బీన్స్‌తోపాటు సార్డైన్‌, సాల్మన్‌ చేపలు, పాలు, గుడ్లను తీసుకోవడం ద్వారా కూడా లభిస్తుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..