Passion Fruit Benefits: ఈ పండు గురించి మీకు తెలుసా? ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

|

Aug 03, 2024 | 9:11 PM

మీరు ప్యాషన్ ఫ్రూట్ గురించి విని ఉండవచ్చు. ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఊబకాయం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. ఇటీవలి కాలంలో కివి, అవకాడో, బ్లూబెర్రీ వంటి పండ్ల వినియోగం ప్రజలలో పెరిగింది. అదేవిధంగా ప్యాషన్ ఫ్రూట్‌కు కూడా డిమాండ్ పెరిగింది...

Passion Fruit Benefits: ఈ పండు గురించి మీకు తెలుసా? ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Passion Fruit Benefits
Follow us on

మీరు ప్యాషన్ ఫ్రూట్ గురించి విని ఉండవచ్చు. ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఊబకాయం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. ఇటీవలి కాలంలో కివి, అవకాడో, బ్లూబెర్రీ వంటి పండ్ల వినియోగం ప్రజలలో పెరిగింది. అదేవిధంగా ప్యాషన్ ఫ్రూట్‌కు కూడా డిమాండ్ పెరిగింది. మరి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

డయాబెటిక్ రోగులకు పాషన్ ఫ్రూట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. అంతేకాదు ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది.

ఈ పండులో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఇందులోని పీచు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పిసెటనాల్, సిర్పుసిన్ బి సమ్మేళనం గుండె జబ్బుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది.

ఫ్యాషన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియ వేగంగా జరిగి, ఆహారం జీర్ణమై బరువును అదుపులో ఉంచుతుంది. ఈ పండు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి మరియు బీటా కెరోటిన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది అనేక కాలానుగుణ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి