Snoring Natural Tips: మీకు నిద్రలో గురక పెట్టే అలవాటు ఉందా..? అయితే ఈ చిట్కాలు పాటించండి

|

Jan 27, 2021 | 5:42 AM

Snoring Natural Tips: నిద్రపోయే సమయలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతుంటారు. ఎదుటి వారికి..

Snoring Natural Tips: మీకు నిద్రలో గురక పెట్టే అలవాటు ఉందా..? అయితే ఈ చిట్కాలు పాటించండి
Follow us on

Snoring Natural Tips: నిద్రపోయే సమయలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతుంటారు. ఎదుటి వారికి నిద్రపట్టదు. అయితే నిద్రపోయేవారు గురక నుంచి గట్టెక్కాలంటే పలు చిట్కాలు పాటిచాలంటున్నారు వైద్య నిపుణులు. గురక రావడానికి ప్రధాన కారణాలు.. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

గురక రావడానికి కారణాలు..

* నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పలువురు పరిశోధకులు చెబుతున్నారు.

* సమయానికి తగినట్టుగా ఆహారం తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణం.

* ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇలా గురక సమస్యతో బాధపడుతుంటారట. దీనికి కార‌ణం ప‌ని ఒత్తిడే.

గుర‌క స‌మ‌స్య‌ను అధికమించ‌డానికి చిట్కాలు ఇలా…

* ప్ర‌తిరోజూ రాత్రి నిద్ర‌పోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్ అవుతుంద‌ట‌.

* అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

* ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి.

*కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.

* ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్ర‌పోతే మంచి ఫలితం కనిపిస్తుంది.

* రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. త‌ద్వారా చాలా కంట్రోల్ అవుతుంద‌ట‌.

ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల గురకను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: COVID VACCINE: కరోనా వ్యాక్సిన్ విషయంలో డబ్లూహెచ్‌వో సంచలన నిర్ణయం.. వారికి ప్రాధాన్యత అవసరం లేదని ప్రకటన..